టక్‌ జగదీష్‌ దర్శకుడు చెప్పిన ఇంట్రెస్టింగ్‌ విషయం

నాని హీరోగా రూపొందిన టక్‌ జగదీష్‌ చిత్రం విడుదలకు సిద్దం అయ్యింది.వచ్చే వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న టక్ జగదీష్‌ చిత్రం ఫస్ట్‌ లుక్‌ మరియు పాటలు టీజర్‌ చూస్తుంటే సినిమా ఒక పక్కా కమర్షియల్‌ ఫ్యామిలీ సినిమా అని క్లారిటీ వచ్చేసింది.

 Nani Again Acted Very Emotional In Tuck Jagadish Movie , Nani , Shiva Nirvana, T-TeluguStop.com

నాని మరియు శివ నిర్వానల కాంబోలో రూపొందిన ఈ సినిమా అంచనాలు భారీగా మోస్తోంది.ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన ‘నిన్ను కోరి’ సినిమా తో సూపర్‌ సక్సెస్‌ ను దక్కించుకున్నారు.

నిన్ను కోరి సినిమా తో నాని ఏడిపించిన విషయం తెల్సిందే.ప్రేయసి సంతోషం కోసం ఆమెను భర్తకు వదిలేసే పాత్రలో నాని కనిపించాడు.

నాని సూపర్‌ యాక్టింగ్‌ తో నిన్ను కోరి సక్సెస్‌ అయ్యింది.ఇప్పుడు టక్‌ జగదీష్‌ లో నాని నటన మహా అద్బుతం అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం టక్‌ జగదీష్‌ చిత్రం లో నాని నటన మరో లెవల్‌ లో ఉంటుందని అంటున్నారు.

ఫ్యామిలీ ఆడియన్స్‌ ప్రతి ఒక్కరు సినిమా చూస్తున్న సమయంలో కన్నీరు పెట్టుకోవడం ఖాయం అంటున్నారు.

షూటింగ్‌ చేస్తున్న సమయంలోనే సెట్ లో ఉన్న వారు కన్నీరు పెట్టుకునే విధంగా నాని నటించాడని తప్పకుండా సినిమా లో ఆయన నటన ప్రతి ఒక్కరిని కూడా ఏడిపించే విధంగా నటించాడంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.తాజాగా టక్‌ జగదీష్‌ దర్శకుడు శివ నిర్వాన మాట్లాడుతూ సినిమా లో నాని నటన తప్పకుండా ప్రతి ఒక్కరిని ఎమోషనల్‌ గా కట్టి పడేస్తుంది.

ప్రతి ఒక్కరికి కన్నీరు తెప్పించే విధంగా నాని నటించాడు అంటూ కామెంట్స్‌ చేశాడు.ఇదో విభిన్నమైన ఫ్యామిలీ ఎంటర్‌ టైనర్‌ కథ అంటూ ఆయన చెబుతున్నాడు.ఐశ్వర్య రాజేష్‌ నటన కూడా సినిమాకు ప్రధాన ఆకర్షణగా ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు.ఇక మరో హీరోయిన్‌ గా రీతూ వర్మ నటించిన విషయం తెల్సిందే.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube