పోస్టర్ మీద వేసుకున్నంత మాత్రాన పాన్ ఇండియా సినిమా అయిపోదంటున్న నాని..!

నాచురల్ స్టార్ నాని హీరోగా వివేక్ ఆత్రేయ డైరక్షన్ లో వస్తున్న సినిమా అంటే సుందరానికీ.మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాలో నజ్రియా హీరోయిన్ గా నటించింది.

 Nani About Pan India Movie Ante Sundaraniki Promotions Ante Sundaraniki Promotio-TeluguStop.com

ఈ సినిమాకు వివేక్ సాగర్ మ్యూజిక్ అందించారు.జూన్ 10న ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో నాని, నజ్రియా పాల్గొంటున్నారు.

ఈ సందర్భంగా ప్రముఖ ఛానెల్ చేసిన ఇంటర్వ్యూలో నాని పాల్గొన్నారు.మీ దృష్టిలో పాన్ ఇండియా సినిమా ఏంటని ఇంటర్వ్యూయర్ అడుగగా నా ఉద్దేశంలో పాన్ ఇండియా సినిమా అని మనం చెప్పుకోవడం కాదు.

అది చెప్పాల్సింది ప్రేక్షకులని అంటున్నారు నాని.మంచి కథతో సినిమా తీస్తే చాలు అది పాన్ ఇండియా సినిమా అవుతుందని అన్నారు.

అందుకు పుష్ప సినిమా నిదర్శనం అని.ఒక సినిమా కోసం దేశమంతా ఎదురుచూస్తే అదే పాన్ ఇండియా సినిమా అని.మనం పోస్టర్ మీద వేసుకున్నంత మాత్రానా అది పాన్ ఇండియా సినిమా కాదని అన్నారు నాని.ఓ విధంగా నాని చెప్పిన లాజిక్ కూడా కరెక్టే అని చెప్పొచ్చు.

కంటెంట్ పాన్ ఇండియా లెవల్ లో ఉంటే అది రిలీజ్ చేసినా చేయకపోయినా పాన్ ఇండియా సినిమా అవుతుందని చెప్పొచ్చు.ఇక ప్రస్తుతం తెలుగు సినిమాలు అందుకుంటున్న విజయాలు చూసి ఇది సినిమాకు గోల్డెన్ ఫేజ్ అని.బాలీవుడ్, టాలీవుడ్ అని కాదు ఇండియా వైజ్ సినిమాకు ఇది మంచి ఫేజ్ అని అన్నారు నాని.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube