''నాని 30'' గ్రాండ్ గా లాంచ్.. మెగా ప్రెజెన్స్ తో ఈవెంట్ సక్సెస్!

Nani 30 To Be Launched With Megastar, Nani30, Nani, Tollywood, Megastar Chiranjeevi, Shouryuv, Mrunal Thakur, Vijayendra Prasad

న్యాచురల్ స్టార్ నాని సినిమాలు అంటే ఫ్యామిలీ ఆడియెన్స్ కు బాగా ఇష్టం.కుటుంబ సభ్యులు అందరితో కలిసి కూర్చుని చూసే విధంగా నాని సినిమాలు ఉంటాయి.

 Nani 30 To Be Launched With Megastar, Nani30, Nani, Tollywood, Megastar Chiranj-TeluguStop.com

అందుకే ఈయన సినిమాలకు మంచి డిమాండ్ ఉంది.ఇక నాని తన కెరీర్ లో ఒక సినిమా ముగియకుండానే మరో సినిమా ప్రకటిస్తాడు అనే విషయం తెలిసిందే.

నాని సినిమాలు ఎంత త్వరగా ప్రకటిస్తాడో అంతే త్వరగా పూర్తి కూడా చేస్తాడు.

ప్రెజెంట్ నాని మరో కొత్త సినిమా స్టార్ట్ చేసాడు.

నాని కెరీర్ లోనే బెంచ్ మార్క్ సినిమా 30వ ప్రాజెక్ట్ కూడా షూట్ కు రెడీ అయ్యింది.ఈ రోజు హైదరాబాద్ లో గ్రాండ్ గా ముహూర్తం జరుపుకుని స్టార్ట్ అయ్యింది.

మరి ఈ సినిమా లాంచింగ్ కోసం మెగా స్టార్ తన మెగా ప్రెజెన్స్ ఇచ్చారు.ఈ వేడుకలో మెగాస్టార్ ఫస్ట్ క్లాప్ కొట్టగా విజయేంద్ర ప్రసాద్ డైరెక్టర్ కు స్క్రిప్ట్ అందించారు.

Telugu Chiranjeevi, Mrunal Thakur, Nani, Nani Launched, Shouryuv-Movie

ఈ సినిమాను కొత్త డైరెక్టర్ శౌర్యన్ తెరకెక్కిస్తుండగా మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో నానికి జంటగా కనిపిస్తుంది.ఈమె కూడా ఈ లాంచ్ ఈవెంట్ లో పాల్గొంది.ఒక బ్యూటిఫుల్ ఎమోషనల్ సినిమాగా దీనిని తెరకెక్కించడానికి నూతన డైరెక్టర్ ప్లాన్ చేసుకుంటున్నాడు.ఇది నాని కెరీర్ లో స్పెషల్ మూవీగా నిలిచి పోనుంది.ఇక ఈ సినిమాను వైరా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుండగా.హీషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్నాడు.

Telugu Chiranjeevi, Mrunal Thakur, Nani, Nani Launched, Shouryuv-Movie

ఇక ఈ సినిమా కంటే ముందు నాని ”దసరా” సినిమాను లైన్లో పెట్టాడు.శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ”దసరా” సినిమా తెరకెక్కుతుంది.ఈ సినిమాలో నానికి జోడిగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.రా అండ్ విలేజ్ డ్రామాగా తెరకెక్కుతున్న దసరా సినిమాపై టీజర్ రిలీజ్ తో మరిన్ని అంచనాలు పెరిగాయి.

ఇక ఈ సినిమా మార్చి 30, 2023 లో భారీ స్థాయిలో పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.ఇక ఈ సినిమాను శ్రీ లక్ష్మి వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తుండగా.

సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నాడు.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube