‘Nani30’ షూట్ అప్డేట్.. ముంబైలో పూర్తి.. నెక్స్ట్ ఎక్కడంటే?

న్యాచురల్ స్టార్ నాని ( Nani )నటించిన ‘దసరా’( Dasara movie ) సినిమా ఇటీవలే రిలీజ్ అయ్యి బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన విషయం తెలిసిందే.శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 30న పాన్ ఇండియా వ్యాప్తంగా ఐదు భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ టాక్ తెచ్చుకుంది.

 ‘nani30’ షూట్ అప్డేట్.. ముంబైలో-TeluguStop.com

ఈ సినిమా మొత్తం 110 కోట్లకు పైగానే వసూళ్లను రాబట్టి నాని కెరీర్ లోనే అత్యధిక కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా నిలిచింది.

Telugu Mrunal Thakur, Mumbai Schedule, Nani, Naniwraps, Nani Schedule, Nani Late

ఇక నాని ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయ్యిందో లేదో వెంటనే మరో సినిమాలో జాయిన్ అయిపోయాడు.నాని కెరీర్ లోనే బెంచ్ మార్క్ సినిమా 30వ ( Nani30 movie )ప్రాజెక్ట్ ప్రకటించి షూట్ స్టార్ట్ అయ్యింది.ఈ సినిమాను కొత్త డైరెక్టర్ శౌర్యన్( Shouryan ) తెరకెక్కిస్తుండగా మృణాల్ ఠాకూర్( Mrunal Thakur ) ఈ సినిమాలో నానికి జంటగా కనిపిస్తుంది.

ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ గోవాలో పూర్తి చేసుకుంది.

ఈ షెడ్యూల్ తర్వాత ఈ సినిమా యూనిట్ మొత్తం ముంబైకి షిఫ్ట్ అయిపొయింది.

అయితే ఈ సినిమా షూట్ గురించి మృణాల్ తాజాగా సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసింది.సీతారామం సినిమాతో బాగా ఫేమస్ అయ్యి తెలుగు ప్రేక్షకులను మెప్పించిన ఈ బ్యూటీ ఆ తర్వాత నటిస్తున్న తెలుగు సినిమా నానిది కావడం విశేషం.

ఈ సినిమా గురించి ఈమె తాజాగా ఒక పోస్ట్ చేసింది.

Telugu Mrunal Thakur, Mumbai Schedule, Nani, Naniwraps, Nani Schedule, Nani Late

ఈ సినిమా ముంబై షెడ్యూల్ పూర్తి చేసుకుంది అని మృణాల్ ఠాకూర్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా తెలిపింది.నానితో కలిసి ఉన్న పిక్ షేర్ చేస్తూ ముంబైలో షూటింగ్ జరుపుకున్న తన సౌత్ ఇండియన్ సినిమా ఇదే నంటూ ఆమె చెప్పుకొచ్చింది.ఇక కియారా ఖన్నా కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ ఎక్కడ జరుపు కుంటారో వేచి చూడాలి.

విభిన్నమైన కథతో ఈ సినిమాను మేకర్స్ ప్లాన్ చేసారు.నాని ఇప్పటి వరకు కనిపించని పూర్తి విభిన్నమైన పాత్రలో ఆయన నటించనున్నాడు.సెప్టెంబర్ నాటికల్లా సినిమా షూట్ ను పూర్తి చేయనుండగా ఈ ఏడాది డిసెంబర్ 21న క్రిస్మస్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇక ఈ సినిమాను వైరా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై చెరుకూరి మోహన్ నిర్మిస్తుండగా.

హీషమ్ అబ్దుల్ సంగీతం అందిస్తున్నాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube