నాని ఆ విషయంలో చాలా పట్టుదలతో ఉన్నట్లుగా కనిపిస్తున్నాడు

Nani 30 Movie Shooting Update , Nani 30 Movie, Dasara Movie,Nani ,Keerthy Suresh

నేచురల్ స్టార్ నాని( nani ) తాజాగా దసరా చిత్రం తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. కీర్తి సురేష్( Keerthy Suresh ) హీరోయిన్ గా నటించిన దసరా చిత్రం( dasara ) మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.

 Nani 30 Movie Shooting Update , Nani 30 Movie, Dasara Movie,nani ,keerthy Suresh-TeluguStop.com

దసరా సినిమా విడుదల తర్వాత ప్రమోషన్ కార్యక్రమాలను మరో వారం రోజుల పాటు నాని నిర్వహించే అవకాశం ఉందని అంతా భావించారు.కానీ దసరా సినిమా విడుదలైన మూడవ రోజే తన తదుపరి సినిమా కు షూటింగ్ లో పాల్గొనేందుకు రెడీ అయ్యాడు.

గోవా లో నాని తదుపరి సినిమా కొత్త షెడ్యూల్ ప్రారంభం కాబోతుంది.ఏకంగా 40 రోజుల పాటు అక్కడ చిత్రీకరణ జరుపబోతున్నట్లుగా చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతుంది.

నాని తదుపరి సినిమా ను కూడా ఈ సంవత్సరం లోనే విడుదల చేయాలనే ఉద్దేశం తో ఉన్నాడట.అందుకే దసరా సినిమా తర్వాత కనీసం వారం పది రోజుల గ్యాప్ కూడా తీసుకోకుండా వెంటనే నాని 30 చిత్రాన్ని చిత్రీకరణ మొదలు పెట్టాడు.అంతే కాకుండా ఈ సినిమా కు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలు కూడా చాలా అగ్రేసివ్ గా మొదటి నుండే చేయాలని భావిస్తున్నారట.అతి త్వరలోనే టైటిల్ ని ప్రకటించడంతో పాటు చిన్న టీజర్ ని కూడా విడుదల చేసే అవకాశాలున్నాయి.

గోవా షెడ్యూల్ 40 రోజులు పూర్తి అయిన తర్వాత కచ్చితంగా సినిమా నుండి టీజర్ మరియు టైటిల్ వచ్చే అవకాశం ఉందని చిత్ర యూనిట్ సభ్యుల ద్వారా సమాచారం అందుతుంది.అందుకు సంబంధించిన ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి.

ఈ సినిమా లో కూడా నాని కొత్త దర్శకుడు తో పనిచేస్తున్న విషయం తెలిసిందే.నాని దసరా సినిమాకు దాదాపుగా వంద కోట్ల వసూళ్లు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Video : Nani 30 Movie Shooting Update #TeluguStopVideo

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube