ఔను… నాని 28 టైటిల్‌ అదే  

nani 28 movie title is ante sundaraniki confirm , ante sundaraniki, nani 28th movie, vivek athreya, nani, nazriya, v movie - Telugu #nani28, Ante Sundaraniki, Nagriya, Telugu Film, Telugu Film News, Vivek Atreya

నాని హీరోగా నజ్రియా హీరోయిన్‌గా వివేక్‌ ఆత్రేయ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్‌ ఇటీవలే ఒక సినిమాను ప్రకటించిన విషయం తెల్సిందే.సినిమా టైటిల్‌ను కూడా ప్రకటిస్తాం అంటూ చెప్పిన వారం రోజుల్లోనే సినిమా టైటిల్‌ను కూడా అనౌన్స్‌ చేశారు.

TeluguStop.com - Nani 28 Movie Title Is Ante Sundaraaniki Confirm

ముందు నుండి ఈ సినిమాకు అంటే సుందరానికి అనే టైటిల్‌ ను పరిశీలిస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.వచ్చినట్లుగానే ఆ టైటిల్‌ను ఖరారు చేశారు.

పెద్దగా సస్పెన్స్‌ లేకుండానే సినిమాకు సంబంధించిన టైటిల్‌ ను రివీల్‌ చేసిన యూనిట్‌ సభ్యులు త్వరలోనే సినిమాకు సంబంధించిన రెగ్యులర్‌ షూటింగ్‌ను కూడా ప్రారంభించబోతున్నట్లుగా ప్రకటించారు.అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతున్నయాని మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మాతల్లో ఒకరైన నవీన్‌ పేర్కొన్నారు.

TeluguStop.com - ఔను… నాని 28 టైటిల్‌ అదే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image

ప్రస్తుతం నాని రెండు సినిమాలు చేస్తున్నాడు.ఆ రెండు సినిమాలు కూడా బాక్సాఫీస్‌ వద్దకు వచ్చేందుకు సమయం పడుతుంది.ఆ సినిమాల విడుదల విషయంతో సంబంధం లేకుండా షూటింగ్‌ కూడా పూర్తి అవ్వకుండానే సినిమాను షురూ చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లుగా సమాచారం అందుతోంది.భారీ ఎత్తున అంచనాలున్న ఈ సినిమాను బాక్సాఫీస్‌ వద్ద విడుదల చేయాలని భావిస్తున్నారు.

అందుకే వచ్చే ఏడాది ద్వితీయార్థంకు తేదీని ప్రకటించారు.వివేక్‌ ఆత్రేయ విభిన్నమైన సినిమాల దర్శకుడిగా పేరు దక్కించుకున్నాడు.

అందుకే ఈ సినిమాకు నాని అభిమానుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.అంచనాలకు తగ్గట్లుగా ఈ సినిమా ఉందా లేదా అనేది త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.ఇప్పటికి రెండు సినిమాలు తెరకెక్కించిన వివేక్‌ ఆత్రేయా రెండు సార్లు కూడా విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు.మరో వైపు ఈ ఏడాది ఓటీటీ ద్వారా నాని ‘వి’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.

ఆ సినిమా నిరాశ పర్చడంతో చాలా డిస్సప్పాయింట్‌ అయ్యాడు.దాంతో సినిమాకు సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు చకచక తీసుకుని వచ్చే ఏడాది కనీసం మూడు సినిమాలు విడుదల చేయాలని ఉబలాట పడుతున్నాడు.

అందుకే అంటే సుందరానికి సినిమాను త్వరలోనే ప్రారంభించి నాలుగు నెలల్లోనే పూర్తి చేయాలని భావిస్తున్నారట.

#Vivek Atreya ##NANI28 #Nagriya

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nani 28 Movie Title Is Ante Sundaraaniki Confirm Related Telugu News,Photos/Pics,Images..