టీజర్‌ టాక్‌ : నందుగాడి బొమ్మ బ్లాక్‌ బస్టర్‌ అయ్యేలా ఉందిగా

నందు హీరోగా నటిస్తున్న సినిమా బొమ్మ బ్లాక్ బస్టర్ కు ప్రమోషన్ ను విభిన్నంగా చేయడంలో నందు సక్సెస్ అయ్యాడు.బిగ్ బాస్ సీజన్‌ 4 ప్రారంభంకు ముందు తాను బిగ్‌ బాస్‌ తో ఎంటర్టైన్మెంట్ చేయబోతున్నట్లు గా నందు సోషల్ మీడియా ద్వారా ప్రకటించడంతో అంతా కూడా నందు బిగ్ బాస్ లోకి వెళ్లబోతున్నట్లుగా భావించారు.

 Nandu Vijay Krishna Rashmigautam Bomma Blockbuster Teaser,  Nandhu, Bomma Block-TeluguStop.com

అయితే చివరకు నందు తాను బిగ్ బాస్ లోకి రావట్లేదని బిబి అంటే బొమ్మ బ్లాక్ బస్టర్ అంటూ ఆ కబురు చల్లగా చెప్పేశాడు.తాను కొత్తగా చేస్తున్న సినిమానే బొమ్మ బ్లాక్ బస్టర్.

ఈ సినిమాలో రష్మి గౌతమ్ హీరోయిన్ గా నటిస్తోంది.

జబర్దస్త్ హాట్ హీరోయిన్ రష్మీ గౌతమ్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న కారణంగా సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఇప్పటికే విడుదలైన పోస్టర్ మరియు ఫస్ట్ లుక్ వీడియో అందర్నీ ఆకట్టుకుంది.తాజాగా ఈ సినిమా టీజర్ ను ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు.టీజర్ అంటూనే దాదాపు రెండున్నర నిమిషాల పాటు ఈ వీడియో ని విడుదల చేశారు.ట్రైలర్ కు తక్కువ టీజర్‌ కు ఎక్కువ అన్నట్లుగా ఈ వీడియో ఉంది.

వీడియో లో సినిమా ఏంటి అనేది క్లారిటీ గా చూపించారు.వీధి నాటకాలు వేసుకునే నందు మరియు హీరోయిన్ ఇతర పాత్రల మధ్య జరిగే కథ ఈ సినిమా.

ఒక విభిన్నమైన కథాంశంతో రూపొందినట్లుగా టీజర్ చూస్తుంటే అనిపిస్తుంది.నందు ఈ సినిమాతో కమర్షియల్ సక్సెస్ కొడతాడంటూ ఆయన సన్నిహితులు మరియు సోషల్ మీడియా వర్గాల వారు నమ్మకంగా ఉన్నారు.

ఇప్పటి వరకు నందు చేసిన సినిమాలు కొన్ని ఆయనకు నటుడిగా మంచి పేరు తెచ్చినా కూడా కమర్షియల్ హిట్స్ మాత్రం దక్కించుకోలేదు.ఈ సినిమా మాత్రం ఆయన కమర్షియల్ సక్సెస్ ను దక్కించుకుంటాడు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.

ఈ సినిమాను త్వరలో షూటింగ్ పూర్తి చేసి వచ్చే ఏడాది ఆరంభంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే అవకాశం ఉంది ఎలాగో థియేటర్లు ఓపెన్ అయ్యాయి.కనుక ఈ సినిమా థియేటర్లోనే విడుదల చేసే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube