గీత మాధురిపై కామెంట్స్‌ను తట్టుకోలేక పోతున్న నందు ఏం చేశాడో తెలుసా..  

Nandu Comments On Who Was Comments Geetha Madhuri In Bigg Boss House-

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 2 అతి త్వరలోనే పూర్తి కాబోతుంది.ఈ సారి ఆరంభం నుండి కూడా విమర్శలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి.ఆ విమర్శలను ఎదుర్కొంటూనే బిగ్‌బాస్‌ను ముందుకు తీసుకు వెళ్తున్నారు.సెలబ్రెటీల విషయంలో ఆరంభంలోనే పెదవి విరిచిన ప్రేక్షకులు ఆ తర్వాత ఒక్కొ ఇంటి సభ్యుడిపై ఒక్కో విధంగా స్పందస్తూ వస్తున్నారు..

Nandu Comments On Who Was Comments Geetha Madhuri In Bigg Boss House--Nandu Comments On Who Was Geetha Madhuri In Bigg Boss House-

మొదట బిగ్‌బాస్‌కు గీతా మాధురి చాలా చాలా ప్లస్‌ అవుతుందని, ఆమె తప్పకుండా ఫైనల్‌ వరకు ఉంటుందని అంతా అనుకున్నారు.అంతా అనుకున్నట్లుగా ఫైనల్‌ వరకు ఆమె ఉండే అవకాశం కనిపిస్తుంది.కాని ఆమెపై ప్రేక్షకుల్లో విమర్శలు తారా స్థాయిలో వస్తున్నాయి.

బిగ్‌బాస్‌లో గీత మాధురి అసలు గేమ్‌ ఆడటం లేదని, అల్లరి చిల్లరగా వ్యవహరిస్తూ ఆమె ఏమాత్రం సీరియస్‌గా ఆడటం లేదు అంటూ అంతా ఆగ్రహంతో ఉన్నారు.ఇదే సమయంలో ఆమె కౌశల్‌ను సీజన్‌ మొత్తంకు కూడా ఎలిమినేషన్‌కు నామినేట్‌ చేయడంతో మరింతగా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.భారీ ఎత్తున విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆమె భర్త నందుకు ఆగ్రహం కలిగినట్లుగా అనిపిస్తుంది.గీతా మాధురిని వ్యక్తిగతంగా విమర్శిస్తున్న వారిపై నందు ఆగ్రహం వ్యక్తం చేశాడు.

గీతా మాధురి ఒక గేమ్‌ షోలో ఉన్న విషయం మర్చి పోవద్దని, ఆమె గేమ్‌ ఆడుతున్న విషయం మర్చి పోయి కొందరు ఆమెను వ్యక్తిగతంగా విమర్శించడం ఏమాత్రం బాగాలేదని, ఆటలో భాగంగా కొన్ని సార్లు ఆమె తీసుకునే నిర్ణయాలు కొందరిని బాధ పెట్టి ఉండవచ్చు.కాని ఆమె అది వ్యక్తిగతంగా తీసుకున్నది కాదు అనే విషయంను తెలుసుకోవాలి.బిగ్‌బాస్‌ గురించిన అభిప్రాయాలు చెప్పే అధికారం అందరికి ఉంటుంది..

కాని ఒక్కరిని టార్గెట్‌ చేస్తూ విమర్శలు చేయడం మాత్రం ఏమాత్రం సమంజసం కాదు అంటూ నందూ ఒక వీడియో సందేశాన్ని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు.

నందు వీడియో సందేశాన్ని కూడా ప్రేక్షకులు పెద్ద ఎత్తున ట్రోల్‌ చేయడం ప్రారంభించారు.దాంతో వెంటనే నందు ఆ వీడియోను తొలగించేశాడు.ఆ వీడియో అసలు కనిపించకుండా చేశాడు.

ట్రోల్స్‌ పెరుగుతున్న కారణంగానే నందు ఆ వీడియోను తొలగించినట్లుగా సమాచారం అందుతుంది.కౌశల్‌ ఆర్మీ మరింతగా గీతను టార్గెట్‌ చేసే అవకాశం ఉందని భావించిన నందు ఆ వీడియోను డిలీట్‌ చేసేశాడు.