ఈ సారైనా వస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్న నందిత  

Nanditha Eagerly Waiting For Successes-nanditha Next Movie,viswamitra Movie

ప్రేమకధా చిత్రం గుర్తు ఉండే ఉంటుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా పరిచయం అయిన నందిత రాజ్. చాలా టాలెంట్ ఉన్న నటి. ఆ చిత్రంలో ఆమె నటనకు అందరూ ఫిదా అయ్యారు. ఆ ఒక్క చిత్రం తోనే నందిత మంచి క్రేజ్ సంపాదించుకుంది..

ఈ సారైనా వస్తుందా అని ఆశగా ఎదురుచూస్తున్న నందిత -Nanditha Eagerly Waiting For Successes

మంచి నటిగా,హావభావాలు పలికించే హీరోయిన్ గా ఒక్క చిత్రం తోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

కానీ ఆ చిత్రం తరువాత కొన్ని చిత్రాల్లో నటించినప్పటికీ నందితకు మాత్రం మంచి బ్రేక్ అనేది దొరకలేదు. ప్రస్తుతం అవకాశాలు వస్తున్నప్పటికీ తానూ ఆశించిన స్థాయిలో మాత్రం హిట్ ని పొందలేకపోతుంది. దీనితో మంచి చిత్రం చేసి పెద్ద బ్రేక్ తీసుకోవాలని నందిత ఉవ్విల్లూరుతుంది.

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ అమ్మడు విశ్వామిత్ర అనే సినిమా చేస్తున్నది. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. జూన్ 14 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. రాజ్ కిరణ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాపై ఈ అమ్మడు భారీ గా హోప్స్ పెట్టుకుంది. ఈ చిత్రం రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అయితే నందిత కి మళ్లీ స్టార్ డమ్ వస్తుంది అని ఈ అమ్మడి ఆశ.

మరి ఈ సినిమా నందితకు హిట్ నిస్తుందో,లేదంటే ఫట్ నిస్తుందో తెలియాలి అంటే జూన్ 14 వరకు ఆగాల్సిందే.