ఎక్కడికి పోతావు చిన్నవాడా చిత్రం తో తెలుగు ప్రేక్షకులకు దెగ్గర అయ్యారు నందిత శ్వేత.ప్రస్తుతం నందిత శ్వేత హీరోయిన్ గా నటించిన బ్లఫ్ మాస్టర్ చిత్రం డిసెంబర్ 28 న విడుదల కానుంది.
ఈ చిత్ర ప్రచారం లో భాగంగా మీడియా తో పలు ఇంట్రెస్టింగ్ విషయాలు పంచుకున్నారు నందిత శ్వేత.
గర్భిణీ గా నటిస్తే తప్పేంటి :
తనని తాను ఒక హీరోయిన్ గా కంటే నటి గానే చూసుకుంటున్నా అని నందిత శ్వేత తెలిపారు.“బ్లఫ్ మాస్టర్ చిత్రం లో మూడు రకాలు షేడ్స్ ఉన్న పాత్రలో కనిపిస్తాను.లవర్, గృహిణిగా, ప్రెగ్నెంట్ ఉమెన్‌గా నటించాను.
గర్భిణీగా నటిస్తే తప్పేముంది.ఈ సినిమాలో నా పాత్ర మాత్రమే చాలా అమాయకంగా ఉంటుంది, ఈ సినిమా లో అమయకురాలి గా కనిపిస్తాను, సినిమా లో నా క్యారెక్టర్ తప్ప మిగిలిన క్యారెక్టర్లు అన్ని మోసం చేసే పాత్రలే.
బ్లఫ్ మాస్టర్ చిత్రం లో నా పాత్ర పేరు అవని.తమిళంలో ఘన విజయం సాధించిన షతురంగ వేట్టై చిత్రానికి రీమేక్ బ్లఫ్ మాస్టర్” అని తెలిపారు నందిత శ్వేత.
వైవిధ్యమైన పాత్రల్లో నటించాలంటే ఇష్టం :
“నాకు వైవిధ్యమైన పాత్రల్లో నటించాలి అంటే చాలా ఇష్టం, పాత్రకు ప్రాధాన్యం తో పాటు నటనకు ఆస్కారం ఉండాలి, బ్లఫ్ మాస్టర్ చిత్రం ద్వారా నాకు మంచి పేరు వస్తుందని నేను నమ్ముతున్నా.ఈ చిత్ర దర్శకుడు నాకు అన్న లాగా, షూటింగ్ సమయం లో నన్ను బాగా చూసుకున్నాడు”, అని నందిత శ్వేత తెలిపారు.
ఈ సినిమాలో నందిత శ్వేత తప్ప మరొకరిని తీసుకోను అని బ్లఫ్ మాస్టర్ దర్శకుడు గోపీ గణేష్ చెప్పారు.