వేశ్య పాత్రలో కనిపించబోతున్న బిగ్ బాస్ ఫేం నందిని రాయ్  

Nandini Roy Role in Metro Kathalu Web Series, Tollywood, Director Karuna Kumar, aha APP, Rajeev Kanakala - Telugu Aha App, Director Karuna Kumar, Nandini Roy Role In Metro Kathalu Web Series, Rajeev Kanakala, Tollywood

ఒటీటీ ప్లాట్ ఫాం వచ్చిన తర్వాత సినిమాలు అవకాశాలు లేని అందాల భామలు డిజిటల్ ఎంటర్టైన్మెంట్ వైపు దృష్టి పెడుతున్నారు.వెబ్ సిరీస్ లలో నటించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.

TeluguStop.com - Nandini Roy Role In Metro Kathalu Web Series

Source:TeluguStop.com.ఈ ఆర్టికల్ తెలుగుస్టాప్.కామ్(TeluguStop.com) నుచి కాపీ చేయబడినది.ఒరిజినల్ ఆర్టికల్ ఇక్కడ క్లిక్ చేసి చదవగలరుTeluguStop.com

అందులో భాగంగా ఏ ఒక్క అవకాశం వచ్చిన వదులుకోవడం లేదు.వెబ్ సిరీస్ లలో అయితే నటించడానికి మంచి అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ ప్రూవ్ చేసుకుంటే ఇక వెబ్ సిరీస్ లలో సెటిల్ కావచ్చని చాలా మంది ఫేడ్ అవుట్ భామలు భావిస్తున్నారు.

TeluguStop.com - వేశ్య పాత్రలో కనిపించబోతున్న బిగ్ బాస్ ఫేం నందిని రాయ్-Movie-Telugu Tollywood Photo Image

ఒకప్పటి స్టార్ హీరోయిన్స్ నుంచి నేటి భామల వరకు అందరూ వెబ్ సిరీస్ లకి జై కొడుతున్నారు.ఈ నేపధ్యంలోనే బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షో సీజన్ 2తో గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ నందిని రాయ్ ఇప్పుడు వెబ్ సిరీస్ కోసం ఏకంగా వేశ్యగా మారిపోయింది.

తెలుగు తెరపై ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోయిన్స్ సైతం వేశ్య పాత్రలో నటించి మెప్పించారు.ఇప్పుడు నందిని రాయ్ వెబ్ సిరీస్ కోసం ఆ పాత్రలో మెప్పించడానికి రెడీ అయిపొయింది.

పలాస ఫేం కరుణ కుమార్ ఆ సినిమా సూపర్ హిట్ తర్వత దొరికిన ఖాళీ సమయంలో అల్లు అరవింద్ ఆహా యాప్ కోసం అదిరిపోయే వెబ్ సిరీస్ ఒకటి సిద్ధం చేశాడు. రచయిత ఖాదర్ బాబు రాసిన మెట్రో కథలు అనే కథల సంపుటిని వెబ్ సిరీస్ గా ఆవిష్కరించారు.

ఈ వెబ్ సిరీస్ ప్రోమో తాజాగా యుట్యూబ్ లో రిలీజ్ అయ్యింది.కుటుంబాలు, ప్రేమ, బాధ వంటి ఎమోషన్స్ మిలితంగా ఈ వెబ్ సిరీస్ ప్రోమోని కరుణ కుమార్ ఆవిష్కరించారు.

అందులో నందిని రాయ్ కూడా చాలా బోల్డుగా నటించింది.ఆమె హై ప్రొఫైల్ వేశ్యగా కనిపించబోతుంది.ఇక సిన్ వెబ్ సిరీస్‌తో గుర్తింపు తెచ్చుకున్న తిరువీర్, రాజీవ్ కనకాలతో పాటు మరికొందరు పాపులర్ నటులు కూడా ఇందులో నటించారు.మరి నందిని రాయ్ పాత్రని మలిచిన విధానం కాస్తా ఎమోషనల్ గానే ఉంది.

మరి ఈ వెబ్ సిరీస్ తో ఆమె ఎంత వరకు గుర్తింపు తెచ్చుకుంటుందో చూడాలి.

#DirectorKaruna #Aha App #NandiniRoy #Rajeev Kanakala

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Nandini Roy Role In Metro Kathalu Web Series Related Telugu News,Photos/Pics,Images..