సమంతను పోలీసుగా చూడగలమా?

కొందరు హీరోలను కొందరు హీరోయిన్స్‌ను మనం కొన్ని పాత్రల్లో అస్సలు ఊహించుకోలేం.ఒకవేళ వారు అలాంటి పాత్రల్లో నటించినా చూసేందుకు ఆసక్తి చూపించము.

 In Nandini Reddy Direction Samantha Play The Police Officer Chracter, Samantha,-TeluguStop.com

అందగత్తెలు సుకుమారంగా ఉండే వారు పోలీస్‌ ఆఫీసర్‌ పాత్ర చేసి రఫ్‌ లుక్‌లో కనిపించి మాస్‌ బాడీలాంగ్వేజ్‌తో నటిస్తామంటే ఎవరైనా ఒప్పుకుంటారా అందుకు ఆ హీరోయిన్‌ అభిమానులు ఒప్పుకుంటారా చెప్పండి.ఖచ్చితంగా ఒప్పుకోరు.

ఈ విషయమే సమంత విషయంలో ఎదురు కాబోతుందా అంటే అవును అనే అంటున్నారు.

సినీ వర్గాల ద్వారా అందుతున్న విశ్వసనీయ సమాచారం ప్రకారం సమంత త్వరలో ఒక రీమేక్‌లో నటించేందుకు ఆసక్తిగా ఉంది.

ఆ రీమేక్‌కు నందిని రెడ్డి దర్శకత్వం వహించబోతుంది.ఆ సినిమాలో కొన్ని సీన్స్‌లో సమంతను పోలీస్‌ ఆఫీసర్‌గా చూసే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఈ విషయంలో సమంత కూడా చాలా ఆసక్తిగా ఉన్నట్లుగా టాక్‌ నడుస్తోంది.

Telugu Nandini Reddy, Samantha, Samanthanandini, Tollywood, Web-Movie

అందగత్తె సుకుమారి అయిన సమంతను పోలీసు పాత్రలో చూడటం అంటే చాలా పెద్ద ఇబ్బందిగా ఆమె ఫ్యాన్స్‌ భావిస్తున్నారు.అలాంటి పరిస్థితి ఎవరు కూడా కోరుకోవడం లేదు.సమంత పోలీస్‌ యూనిఫార్మ్‌లో అస్సలు బాగోదని, ఆమె ఆ ప్రయత్నం మానుకుంటే బాగుంటుందని, అందమైన చీరకట్టులో మోడ్రస్‌ డ్రస్‌లో కనిపించి మెప్పించాలి కాని పోలీస్‌గా నటిస్తానంటే మాత్రం ఒప్పుకోక పోవచ్చు అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube