ఐటెం పాపగా మారుతున్న బిగ్ బాస్ బ్యూటీ

తెలుగు బుల్లితెరపై బిగ్‌బాస్ రియాలిటీ షోకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.ఈ షోను ప్రేక్షకులు బాగా ఆదరిస్తుండటంతో ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్‌కు మంచి క్రేజ్ ఏర్పడుతుండటంతో బిగ్‌బాస్ షోకు మరింత ఫాలోయింగ్ పెరుగుతూ వస్తోంది.

 Nandini Rai Item Song In Kothi Kommachi, Nandini Rai, Kothi Kommachi, Sathish Ve-TeluguStop.com

ఇక ఈ షోలో పాల్గొనే లేడీ కంటెస్టెంట్స్‌కు సినిమాల్లో మంచి ఆఫర్లు వస్తూ ఉన్నాయి.బిగ్‌బాస్ సీజన్ 2లో పాల్గొన్న లేడీ కంటెస్టెంట్స్‌లో నందినీ రాయ్ తన అందంతో పాటు చలాకీతనంతోనూ తెలుగు ప్రేక్షకులను మెప్పించింది.

కాగా ఇటీవల ఆమె వరుస ఫోటోషూట్‌లతో టాలీవుడ్ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.తాజాగా దర్శకుడు సతీష్ వేగేశ్న తెరకెక్కిస్తున్న ‘కోతి కొమ్మచ్చి’ అనే సినిమా ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని క్రియేట్ చేస్తోంది.

ఈ సినిమాలో సమీర్ వేగేశ్న, ముఘాంశ్ శ్రీహరిలు హీరోలుగా నటిస్తున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శ్రీకాకుళంలో శరవేగంగా జరుగుతోండగా, ఈ సినిమాలో ఓ స్పెషల్ ఐటెం సాంగ్ కోసం నందినీ రాయ్‌ను చిత్ర యూనిట్ సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది.

ఈ పాటతో నందిని రాయ్‌కు మంచి పేరు వస్తుందని, తద్వారా మరిన్ని అవకాశాలు రావడం ఖాయమని చిత్ర యూనిట్ అంటోంది.

ఇక ఈ సినిమాను పూర్తి యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌గా సతీష్ వేగేశ్న తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

గతంలో సతీష్ తెరకెక్కించిన శతమానం భవతి, శ్రీనివాస కళ్యాణం లాంటి ఫ్యామిలీ ఓరియెంటెడ్ చిత్రాలు మంచి విజయాన్ని అందుకోవడంతో, ఈసారి తన పంథాకు భిన్నంగా యూత్‌ఫుల్ సబ్జెక్టుతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సతీష్ ‘కోతి కొమ్మచ్చి’ చిత్రంతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు.మరి ఈ సినిమాలో ఐటెం పాపగా నందిని రాయ్‌కు ఎలాంటి హిట్ దక్కుతుందో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube