మరోసారి సత్తా చాటిన కౌశల్‌ ఆర్మీ.. నందిని ఔట్‌  

Nandini Eliminated From Bigg Boss 2 Telugu-

Last week in the second season of Telugu Biggs who was not eliminated. In addition, the two formerly eliminated entries were made. Nutan Naidu and Shyamalas came into the house and felt that the two were to be eliminated today. But only Nandini was eliminated. Nandini, a heroine, The audience did not show interest to support her. Nandini has to be eliminated.

.

Kaushal and Babu Gogineni, who were nominated for Eliminate, went to the safe zone on Saturday and TV 9 Deepthi and Ganesh were safe on Sunday. Lesser votes for Nandhi than in Ganesh has become a subject of debate. At this time, Nandini will be promoted on social media as the Kaushal Army is due to Elimination. From the beginning of the season, only those who talked against Kaushal or the Kaushal were only eliminated. Nandini has been repeatedly strained by Kaushal in the past several weeks and previous weeks. Kaushal fans say that Nandini has been eliminated. . There is no doubt that the Kaushal Army is presently influenced by social media. Kaushal holds a huge fan. That's why he's going to the safe zone if he's in the elimination. Last week Kaushal said that the votes of the Mathews had a large number of votes. Some say that Nandhi was forced out because he was with Kaushal. . . Analysts have expressed opinion that the Kaushal Army has voted for others to save Nandini while saving Kaushal on the one hand. Some shock to social media followers of Kaushal. Nani was targeted at Kaushal Army social media after Kaushal was targeted in the episode of Nani Saturday. Kaushal is the hero of the movie ........

తెలుగు బిగ్‌బాస్‌ రెండవ సీజన్‌లో గత వారం ఎవరు ఎలిమినేట్‌ అవ్వలేదు. దానికి తోడు ఇద్దరు గతంలో ఎలిమినేట్‌ అయిన వారు లోనికి వచ్చిన విషయం తెల్సిందే. నూతన్‌ నాయుడు మరియు శ్యామలలు ఇంట్లోకి వచ్చిన నేపథ్యంలో ఈవారం ఇద్దరు ఎలిమినేట్‌ అవ్వడం ఖాయం అని అంతా భావించారు..

మరోసారి సత్తా చాటిన కౌశల్‌ ఆర్మీ.. నందిని ఔట్‌-Nandini ELIMINATED From Bigg Boss 2 Telugu

కాని కేవలం నందిని మాత్రమే ఎలిమినేట్‌ అయ్యింది. హీరోయిన్‌ అయిన నందినిని ప్రేక్షకులు తిరష్కరించారు. ఆమెకు మద్దతుగా నిలిచేందుకు ప్రేక్షకులు ఆసక్తి చూపించలేదు.

దాంతో నందిని ఎలిమినేట్‌ అవ్వాల్సి వచ్చింది.

ఎలిమినేట్‌కు నామినేట్‌ అయిన వారిలో కౌశల్‌ మరియు బాబు గోగినేని శనివారం సేఫ్‌ జోన్‌లోకి వెళ్లగా, ఆదివారం టీవీ9 దీప్తి మరియు గణేష్‌లు సేఫ్‌ అయ్యారు. గణేష్‌ కంటే నందినికి తక్కువ ఓట్లు రావడం చర్చనీయాంశం అయ్యింది. ఈ సమయంలోనే నందిని ఎలిమినేషన్‌కు కారణంగా కౌశల్‌ ఆర్మీ అంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం జరుగుతుంది.

సీజన్‌ ఆరంభం నుండి కూడా కౌశల్‌కు వ్యతిరేకంగా మాట్లాడిన వారు లేదా కౌశల్‌తో గొడవ పడ్డవారు మాత్రమే ఎలిమినేట్‌ అవుతూ వచ్చారు. గత వారంలో పలు సార్లు, అంతకు ముందు వారాల్లో కూడా కౌశల్‌తో నందిని పదే పదే గొడవ పడటం జరిగింది. దాంతో నందిని ఎలిమినేట్‌ అయ్యిందని కౌశల్‌ అభిమానులు అంటున్నారు..

కౌశల్‌ ఆర్మీ ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఎక్కువగా ప్రభావం చూపుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కౌశల్‌ భారీ ఫ్యాన్స్‌ను సొంతం చేసుకున్నాడు. అందుకే ఆయన ఎలిమినేషన్స్‌లో ఉంటే ఈజీగా సేఫ్‌ జోన్‌లోకి వెళ్లి పోతున్నాడు.

గత వారం కౌశల్‌కు భారీ ఎత్తున ఓట్లు పోల్‌ అయినట్లుగా మాటీవీ వర్గాల వారు చెబుతున్నారు. కౌశల్‌తో పెట్టుకున్న కారణంగానే నందిని ఔట్‌ అవ్వాల్సి వచ్చిందని కూడా కొందరు అంటున్నారు.

కౌశల్‌ ఆర్మీ ఒక వైపు కౌశల్‌ను సేవ్‌ చేస్తూనే నందినిని బయటకు పంపించేందుకు ఇతరులకు ఓట్లు వేశారని, అందుకే ఆమె ఇంటి నుండి బయట పడ్డదంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కౌశల్‌కు ఉన్న సోషల్‌ మీడియా ఫాలోయింగ్‌కు కొందరు షాక్‌ అవుతున్నారు.

నాని శనివారం నాటి ఎపిసోడ్‌లో కౌశల్‌ను టార్గెట్‌ చేయడంతో, నానిని కౌశల్‌ ఆర్మీ సోషల్‌ మీడియాలో టార్గెట్‌ చేయడం జరిగింది. మొత్తానికి కౌశల్‌ హీరో అయ్యాడు.