సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో శ్రీ శివ విష్ణు ఆలయ నాందీ ఉత్సవ కార్యక్రమం

సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో శ్రీ శివ విష్ణు ఆలయ నాందీ ఉత్సవ కార్యక్రమం.ఈ సందర్బంగా జరిగిన వర్చ్యువల్ సంగీత విభావరి.

 Nandi-festival-of-sri-shiva-vishnu-temple-under-the-auspices-of-sai-datta-peetha-TeluguStop.com

ఏప్రిల్ 18:సౌత్ ప్లైన్ఫీల్డ్: సాయి దత్త పీఠం ఆధ్వర్యంలో ఆన్ లైన్ వేదికగా జరిగిన సంప్రదాయ సంగీత విభావరికి అద్భుతమైన స్పందన లభించింది.వేల మంది ఆన్ లైన్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షించారు.

న్యూజెర్సీ, ఎడిసన్లో సాయి దత్త పీఠం శ్రీ శివ విష్ణు ఆలయాన్ని నిర్మించింది.ఈ ఆలయ నిర్మాణ ప్రారంభోత్సవానికి సన్నాహకంగా సాయి దత్త పీఠం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది.

ఆరెంజ్ మీడియా కాన్సెప్ట్ సహకారంతో ఆన్‌లైన్ ద్వారా ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో సంప్రదాయ సంగీత కళాకారులంతా తమ ప్రతిభను ప్రదర్శించారు.ముఖ్యంగా వీక్షకులు భక్తి సంగీతం లోమునిగితేలారు.

అనేక భాషలలో, అనేక భక్తి గీతాలతో వీక్షకులను అలౌకిక ప్రపంచంలోకి తీసుకెళ్లారు.

Telugu Kibha Sree, Jersy, Raghushankara-Telugu NRI

ప్రఖ్యాత వీణా విద్వాంసుడు శ్రీ ఫణి నారాయణ గారు,తన వాద్య సహకార బృందంతో 2 గంటల పాటు , ఆన్లైన్ ప్రత్యక్ష ప్రసారం తో సంగీతఝరి లో ఓలలాడించారు.ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి, గురు స్వాతి అట్లూరి గారు ప్రదర్శించిన భక్తి రసమయ నృత్య కార్యక్రమం, దివ్య ఏలూరి తన శిష్య బృందం తో గతంలో చేసిన నృత్య మెడ్లీ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచాయి. ఒడిస్సీ నృత్య కళాకారిణి బిడిష మహంతి చే మోక్ష నృత్య ప్రదర్శన, జయీత దత్త ప్రదర్శించిన కథక్ నృత్య ప్రదర్శన, ఇంకా ఎంతో మంది కళాకారుల సంగీత కార్యక్రమాలు, ప్రముఖ సంగీత గురు రామాచారి బృంద గాన కచేరీ, వీణా, ఫ్లూట్, సితార్ లతో కూడా కళాకారులు అందరినీ అలరింపచేసారు.

హైదరాబాద్ నుండి ప్రముఖ గాయకులు హరి గుంట, ప్రవీణ్ కొప్పోలు పద్యాలు,,వైజాగ్ శ్రీ మాత స్టూడియోస్ నుండి వెంపలి అఖిల, శ్రీ లత మూల తదితరుల సంగీత విభావరి ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.

Telugu Kibha Sree, Jersy, Raghushankara-Telugu NRI

ప్రముఖ కవి, సంగీత విద్వాంసుడు కిభశ్రీ అర్ధ్వర్యంలో మిత్ర ప్రాశ్నిక బృందంతో ఈ కార్యక్రమాన్ని ఆన్ లైన్ లో అద్భుతంగా నిర్వహించినందుకు ఆరెంజ్ మూన్ కాన్సెప్ట్ అధినేత అశోక్ బడ్డి, మరియు సాంకేతిక బృందానికి సాయి దత్త పీఠం నిర్వాహకులు రఘు శర్మ శంకరమంచి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.చివరిగా, సాయి దత్త పీఠం నుండి లైవ్ లో పాల్గొని తమ పాటలతో అలరించిన ప్రసాద్ సింహాద్రి, అదితి భావరాజు లను రఘుశర్మ, ఉపేంద్ర లు సత్కరించారు.మే 2 నుంచి 8 వరకు శ్రీ శివ, విష్ణు ఆలయ ప్రారంభోత్సవ కార్యక్రమాలు జరగనున్నవని, దీనిని కూడా దిగ్విజయం చేయాలని రఘు శర్మ శంకరమంచి భక్తులను కోరారు.శ్రీ శివ, విష్ణు ఆలయంలో ప్రత్యేక విశిష్టతలన్నింటిని ఆన్ లైన్లో వివరించారు.

న్యూజెర్సీలో హిందు ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు శ్రీ శివ, విష్ణు ఆలయాన్ని సకల దేవతల సమాహారంగా తీర్చిదిద్దినట్టు రఘు శంకరమంచి తెలిపారు.న్యూజెర్సీలోని భక్తులంతా శ్రీ శివ, విష్ణు ఆలయ ప్రారంభోత్సవానికి తరలిరావాలని, న్యూజెర్సీ పబ్లిక్ యూటిలిటీ కమిషనర్ ఉపేంద్ర చివుకుల కోరారు ఆన్ లైన్ సంగీత విభావరిలో పాల్గొన్న ప్రతి ఒక్కరిని ప్రత్యేకంగా అభినందించారు.

ఇంకా ఈ కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించిన సాయి దత్త పీఠం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ అశోక్ బడ్డి, మురళీకృష్ణ మేడిచెర్ల లతో పాటు దత్త పీఠం డైరెక్టర్ లను, స్టాఫ్, వాలంటీర్స్ ను ఎస్.డి.పి కుటుంబ సభ్యులందరిని, ఓం కాన్సెప్ట్స్ టీమ్ సభ్యులను రఘు శర్మ శంకరమంచి ప్రత్యేకంగా అభినందించారు.ఇదే స్ఫూర్తితో మే 2 నుంచి 8న జరిగే ఆలయ ప్రారంభోత్సావాన్ని ఘనంగా నిర్వహించాలని కోరారు.

అలాగే మీడియా ద్వారా విస్తృత ప్రచారం కల్పించిన ప్రతీ టీవీ ఛానెల్ రేడియో ఛానెల్ కు కృతజ్ఞతలు తెలియచేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube