హుజూర్‌ నగర్‌లో నందమూరి సుహాసిని  

Nandhamuri Suhasini Support In Tdp Candidate Kiranmayi In Huzurnagar Elections - Telugu Huzurnagar Elections, Huzurnagar Tdp Candidate Kiranmayi, Nandhamuri Suhasini, Nandhamuri Suhasini Support In Huzurnagar Elections

తెలంగాణలో అతి త్వరలో జరుగబోతున్న హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ మరియు టీఆర్‌ఎస్‌ ఢీ అంటే ఢీ అంటున్నాయి.ఈ సమయంలోనే బీజేపీ మరియు టీడీపీలు కూడా ప్రభావం చూపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి.

Nandhamuri Suhasini Support In Tdp Candidate Kiranmayi In Huzurnagar Elections

బీజేపీ రాష్ట్ర నాయకులు పలువురు హుజూర్‌ నగర్‌లో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.మరో వైపు టీడీపీ అభ్యర్థి కిరణ్మయి తరపున ప్రచారం చేసేందుకు తెలుగు దేశం పార్టీ ముఖ్య నాయకులు రంగంలోకి దిగుతున్నారు.

ఇప్పటికే ఎమ్మెల్యే బాలకృష్ణ హుజూర్‌ నగర్‌ ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నట్లుగా ప్రచారం జరిగింది.ఇక తాజాగా నందమూరి సుహాసిని కూడా ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు ముందుకు వస్తున్నారు.

హుజూర్‌ నగర్‌లో నందమూరి సుహాసిని-Political-Telugu Tollywood Photo Image

కిరణ్మయి తరపున సుహాసిని రెండు లేదా మూడు రోజుల పాటు ఎన్నికల ప్రచారంలో పాల్గొనబోతున్నారు.మొన్నటి ఎన్నికల్లో కూకట్‌ పల్లి నుండి పోటీ చేసిన నందమూరి సుహాసిని ఓటమి పాలైన విషయం తెల్సిందే.

అయినా కూడా ఆమె తెలుగు దేశం పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటూనే ఉంది.ఈ సమయంలో మళ్లీ హుజూర్‌ నగర్‌ ఎన్నికల ప్రచారంలో ఆమె కనిపించబోతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు