తెలుగు సినిమా పరిశ్రమలో నందమూరి ఫ్యామిలీకి ఉన్న పేరు ప్రతిష్టల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.నందమూరి తారక రామారావు వారసులుగా ప్రస్తుతం పలువురు ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్నారు.
అయితే అది నాణెంకు ఒక్కవైపు మాత్రమే.నాణెంకు రెండవ వైపు మరోలా ఉంది.
సినిమా పరిశ్రమలో ఉన్న వారు కాకుండా ఇతరులు కాస్త ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు.ఎన్టీఆర్ వారసులు కొందరు కొన్ని కారణాల వల్ల సినిమాలకు దూరంగా ఉన్నారు.
కొందరు మాత్రం సినిమాల్లో ప్రయత్నించినా కూడా సఫలం కాలేక పోయారు.అందులో ఒకడు తారకరత్న.
ఈయన పలు సినిమాలు చేసినా కూడా ఏ ఒక్కటి కూడా ఆకట్టుకోలేక పోయాయి.
హీరోగా ఒకేసారి దాదాపు ఎనిమిది సినిమాలను మొదలు పెట్టి రికార్డు సృష్టించిన తారకరత్న అందులో ఏ ఒక్కటి సక్సెస్ కాకపోవడంతో పూర్తిగా ఢీలా పడిపోయాడు.హీరోగా సక్సెస్‌ు రావడం లేదనే ఉద్దేశ్యంతో విలన్‌గా కూడా ప్రయత్నించాడు.విలన్ వేశాలు బాగానే వేస్తున్నప్పటికి ఈయనకు ఆ వేశాలు ఇచ్చేందుకు స్టార్ దర్శకులు ఆసక్తి చూపడం లేదు.
నందమూరి ఫ్యామిలీ హీరో విలనా అంటూ విమర్శలు వ్యక్తం అవుతాయనే ఉద్దేశ్యంతో ఆ ఛాన్స్‌లు కూడా ఇవ్వలేదు.దాంతో తారకరత్న పరిస్థితి దారుణంగా తయారు అయ్యింది.ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతున్న సమయంలో అనుకోని అవకాశం దక్కింది.
తారకరత్న బిగ్‌బాస్ సీజన్ 2లో కనిపించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది.
సాదా సీదా సెలబ్రెటీలు మాత్రమే బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇస్తారు.బిగ్‌బాస్‌లో పాల్గొంటున్నారు అంటే వారికి ఆఫర్లు లేక పోవడంతో పాటు, వారు సినిమా పరిశ్రమకు దూరంగా ఉంటున్న వారే అయ్యి ఉంటారు.
ఇప్పుడు తారకరత్న బిగ్‌బాస్‌లో పార్టిసిపేట్ చేస్తున్నాడు కనుక ఆయన పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.చాలా హీనమైన స్థితిలో ఆయన ఉన్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది.
బిగ్‌బాస్‌లో రికమండేషన్‌తో ఆయన చోటు దక్కించుకున్నాడు.
బిగ్‌బాస్‌లో కనీసం మూడు నాలుగు వారాలు ఉండటం వల్ల వచ్చే మొత్తం డబ్బుతో అంతో ఇంతో కాలం వెల్లదీయవచ్చు అనేది ఆయన ఉద్దేశ్యం అంటూ సినీ వర్గాల్లో పుకార్లు షికార్లు చేస్తున్నాయి.
అయితే తారకరత్న పరిస్థితి మరీ అంత దారుణంగా ఏమీ లేదని, బిగ్‌బాస్‌లో పాల్గొంటే సినిమాల్లో ఆఫర్లు వస్తాయనే ఉద్దేశ్యంతో పాల్గొంటున్నాడేమో అంటూ కొందరు ఆలోచిస్తున్నారు.మొత్తానికి ఒక నందమూరి హీరో హోస్ట్‌గా చేసిన షోలో అదే ఫ్యామిలీకి చెందిన హీరో పార్టిసిపెంట్‌గా ఎంపిక కావడం కాస్త శోచనీయం.
బిగ్‌బాస్ సీజన్ 2 జూన్ 10 నుండి స్టార్ మాలో ప్రసారం కాబోతున్న విషయం తెల్సిందే.తారకరత్నతో పాటు ఇంకా ఎవరు ఇందులో కనిపించబోతున్నారు అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.