అన్నగారి కెరియర్లో వందల సినిమాలు.. కానీ ఆయనకు నచ్చిన మూవీ ఏదో తెలుసా?

తెలుగు చిత్ర పరిశ్రమలో ఒక సాదా సీదా హీరో గా ఎంట్రీ ఇచ్చి తెలుగు ప్రజలందరికీ ఆత్మబంధువు గా మారిపోయారు సీనియర్ ఎన్టీఆర్. సినిమాల్లో హీరోగా ఎన్నో పౌరాణిక పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెప్పించటమే రాజకీయ నాయకులు కూడా ప్రతి ఇంటి దగ్గరైయ్యారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు.

 Nandamuri Taraka Rama Rao Favorite Movie Details, Nandamuri Taraka Rama Rao , Sr-TeluguStop.com

ఎన్టీఆర్ కెరీర్లో ఎన్నో వందల సినిమాల్లో నటించి తిరుగులేదు అని నిరూపించారు.ఎలాంటి పాత్రలోనైనా సరే పరకాయ ప్రవేశం చేసి నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు అన్నగారు.

ఒక పాత్రలో ఎన్టీఆర్ నటించడం ఇక ఆ పాత్రలో నటన బాగా లేకపోవడం అలా మాట్లాడటం అంటే అతిశయోక్తే అవుతుంది అని అప్పట్లో విమర్శకులు అనుకునేవారు అని చెప్పాలి.

ఇలా సినిమానే ఊపిరిగా బ్రతికిన అన్నగారు తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైన వ్యక్తిగా కూడా ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు.

అయితే ఎన్టీఆర్ నటించిన చిత్రాలను తన హిస్టరీ ఆఫ్ ఎన్టీఆర్ అనే పుస్తకంలో రాసుకున్నారు.ఈ క్రమంలోనే ఇక తనకు బాగా నచ్చిన ఇష్టమైన సినిమా ఏది అన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా ప్రస్తావించారు.

ఇక ఇలా అన్నగారికి నచ్చిన సినిమా ఏదో కాదు శ్రీనాథ కవి సార్వభౌమ. బాపు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా మహాకవి శ్రీనాథుడి కి సంబంధించిన జీవితాన్ని తెరపై చూపిస్తుంది.

అయితే ఎలాంటి కమర్షియల్ హంగులు లేకుండా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అప్పుడు వరకు అన్నగారు నటించిన పౌరాణిక సినిమాలు బ్లాక్బస్టర్ విజయాలను సాధించాయి.

Telugu Bapu, Ntr, Nandamuritaraka, Senior Ntr, Sr Ntr, Sr Ntr Favorite, Srinatha

ఇక ఈ సినిమాపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెట్టుకున్నారు అభిమానులు.కానీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక ఈ సినిమా డిజాస్టర్గా నిలిచింది.కానీ ఈ సినిమా మాత్రం అన్న గారికి ఎంతో ఇష్టమైన సినిమాగా నిలిచింది.ఎందుకంటే ఈ సినిమాలో అన్నగారు శ్రీనాధుడి గా జయసుధ ఆయన భార్య గా నటించారు.

సినిమాకు అన్న గారు ప్రాణం పెట్టి పని చేశారు.ఇక తనకు తానే మేకప్ వేసుకోవడం పాత్రల్లో ఒదిగిపోవడం చేశారు.

అందుకే అన్నగారు కెరియర్ లో హిట్ అయిన సినిమాల కంటే ఇలా డిజాస్టర్గా నిలిచినా సినిమా అయినప్పటికీ తనకు నచ్చిన సినిమా అంటు ఎన్నోసార్లు చెప్పుకొచ్చారు అన్నగారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube