నందమూరి మోక్షజ్ఞ ఫస్ట్ మూవీలో విలన్ అతనేనా.. వైరల్ వార్తల్లో నిజమెంత?

నందమూరి మోక్షజ్ఞ ( Nandamuri Mokshagna )సినీ ఎంట్రీ కొరకు అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే.

మోక్షజ్ఞ ఫస్ట్ మూవీకి సంబంధించి ఏ అప్ డేట్ వచ్చినా ఆ అప్ డేట్ క్షణాల్లో వైరల్ అవుతోంది.

మోక్షజ్ఞ ఫస్ట్ మూవీకి ప్రశాంత్ వర్మ డైరెక్టర్ అనే సంగతి తెలిసిందే.అయితే మోక్షజ్ఞ ఫస్ట్ మూవీకి సంబంధించి క్రేజీ విషయాలు నెట్టింట ప్రస్తుతం తెగ వైరల్ అవుతున్నాయి.

మోక్షజ్ఞ ఫస్ట్ మూవీలో రానా విలన్ గా నటిస్తారని వైరల్ అవుతున్న వార్తల సారాంశం.రానా( Rana ) విలన్ గా నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు అంచనాలను మించి హిట్ గా నిలిచాయి.రానాకు ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు ఉంది.

మోక్షజ్ఞ ఫస్ట్ మూవీని మేకర్స్ భారీ స్థాయిలోనే ప్లాన్ చేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.

Advertisement

మరోవైపు మోక్షజ్ఞ ఫస్ట్ మూవీలో హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు సైతం ఆసక్తికర సమాధానం వినిపిస్తోంది.2025లోనే మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ రిలీజయ్యే అవకాశం ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బాలయ్య ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించనున్నారని తెలుస్తోంది.

ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కు ఎక్కువగానే ప్రాధాన్యత ఉండనుందని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.డిసెంబర్ నెల 2వ తేదీన మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ మూహూర్త కార్యక్రమాలు జరగనున్నాయని తెలుస్తోంది.

మైథలాజికల్ టచ్ తో ఈ సినిమా తెరకెక్కనుంది.మోక్షజ్ఞ ఫస్ట్ మూవీ బాలయ్య సొంత బ్యానర్ లో తెరకెక్కనుంది.

ఈ సినిమాకు బడ్జెట్ విషయంలో మేకర్స్ ఏ మాత్రం రాజీ పడే అవకాశం అయితే లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.నందమూరి మోక్షజ్ఞ రాబోయే రోజుల్లో మీడియా ముందుకు వచ్చి ఎన్నో ఆసక్తికర విషయాలను వెల్లడించే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది.

అల్లు అర్జున్ కి ఇష్టమైన సినిమా ఏంటో తెలుసా..? ఆ సినిమాను ఇప్పటి వరకు ఎన్ని సార్లు చూశాడంటే..?
Advertisement

తాజా వార్తలు