ఛీ ! వాడు నా మనవడు ఏంటి అంటూ లోకేష్ పై ...?  

Nandamuri Lakshmi Parvathi Coments On Lokesh-

ఇప్పటికే టీడీపీ నేతల నుంచి అధికార వైసీపీ నుంచి తీవ్ర విమర్శలు ఎదుర్కుంటూ నవ్వులపాలవుతున్న లోకేష్ను ఇప్పుడు అందరూ ప్రధానంగా టార్గెట్ చేసుకున్నారు.ఏపీ రాజకీయాలు మొత్తం లోకేష్ చుట్టూనే తిరుగుతున్నాయి.టీడీపీకి కాబోయే రథసారధిగా పిలవబడుతున్న లోకేష్ కు ఈ పరిణామాలు మింగుడుపడడంలేదు.ఈ దశలో ఎన్టీఆర్ సతీమణి, వైసీపీ నాయకురాలు నందమూరి లక్ష్మీ పార్వతి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.

Nandamuri Lakshmi Parvathi Coments On Lokesh- Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage Nandamuri Lakshmi Parvathi Coments On Lokesh--Nandamuri Lakshmi Parvathi Coments On Lokesh-

ఓ మీడియా ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వూలో లోకేష్ ను ఉద్దేశించి ఛీ వాడు నా మనవడు ఏంటి అంటూ లక్ష్మీ పార్వతి విరుచుకుపడ్డారు.మీడియా ఛానెల్ ప్రతినిధి లక్ష్మీ పార్వతిని ప్రశ్న అడుగుతూ లోకేష్ మీ మనవాడే కదా అంటూ ప్రశ్నించగా వాడు నా మనవడు ఏంటి ఆ మాట వింటే నాకు బాధ కలుగుతుంది.నాపై నిందలు వేసిన వ్యక్తి , నన్ను ఎన్నో అవమానాలకు గురి చేయడానికి కారణమైన వ్యక్తి వాడు.ఎట్టి పరిస్థితుల్లో నా మనవడు కాదు అంటూ లక్ష్మీపార్వతి కుండబద్ధలు కొట్టినట్టు చెప్పారు.

ఏ నాయకుడైనా సొంతంగా మాట్లాడాలని సరిగా పరిజ్ఞానం లేక పేపర్ మీద రాసి ఇచ్చినా సరే ఒకటి రాసిస్తే మరొకటి చదువుతుంటాడు అంటూ లోకేష్ పరువు తీశారు లక్ష్మి పార్వతి.అయితే ఈ వ్యాఖ్యలపై టీడీపీ నాయకులు మండిపడుతున్నారు.