దండం పెడుతున్న కళ్యాణ్ రామ్.. ఇక చాలట!  

నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ ‘ఎంత మంచివాడవురా’ ఇటీవల సంక్రాంతి కానుకగా జనవరి 15న రిలీజ్ అయిన విషయం తెలిసిందే.రెండు పెద్ద సినిమాల మధ్య రిలీజ్ అయిన ఈ చిన్న సినిమాకు తొలిరోజే ఎదురుదెబ్బ తగలడంతో ఇక ఇలాంటి సినిమాల జోలికి పోవద్దని డిసైడ్ అయ్యాడట కళ్యాణ్ రామ్.

TeluguStop.com - Nandamuri Kalyan Ram Decides Not To Do Experiments

రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయిన సమయంలో చిన్న సినిమాలను ఎక్కువశాతం రిలీజ్ చేయరు.కానీ శతమానం భవతి సినిమా సెంటిమెంట్‌ను అతిగా నమ్మిన దర్శకుడు సతీష్ వేగ్నేశ, ఈ సినిమాను కూడా అదే తరహాలో రిలీజ్ చేసి సత్తా చాటాలనుకున్నాడు.

పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా టీజర్, ట్రైలర్లు ప్రేక్షకులను ఆకట్టుకుంది.దీంతో సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుందని అనుకున్నారు అందరూ.

కానీ సినిమా రిలీజ్ తరువాత సీన్ రివర్స్ అయ్యింది.పెద్ద సినిమాలకు జనం ఓటేయడంతో ఎంత మంచివాడవురా సినిమాను పట్టించుకున్న నాధుడే లేడు.

దీంతో ఈ సినిమా డిజాస్టర్‌గా మిగిలింది.ఈ సినిమాపై మంచి అంచనాలు పెట్టుకున్న కళ్యాణ్ రామ్, తన నెక్ట్స్ సినిమాలలో ఎలాంటి ప్రయోగాలు చేయకూడదని నిర్ణయించుకున్నాడు.

కేవలం కమర్షియల్ అంశాలునన సినిమాలకే తన ఓటు ఉంటుందని దర్శకనిర్మాతలు తెలిపాడట.

#NandamuriKalyan

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు