అఫిషియల్‌ : నందమూరి బింబిసారా టీజర్ ఎప్పుడంటే..!

నందమూరి అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బింబిసారా ఆ సినిమా విడుదలకు సిద్ధమైంది.ఈ సినిమా షూటింగ్ గత నెల లోనే పూర్తి చేసినట్లుగా వార్తలు వచ్చాయి.

 Nandamuri Kalyan Ram Bimbisara Movie Teaser Update,nandamuri Kalyan Ram, Bimbisa-TeluguStop.com

కానీ చిత్ర యూనిట్ సభ్యులు ఇప్పటి వరకు ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించలేదు.నందమూరి కళ్యాణ్ రామ్ హీరో గా కేథరిన్ తెరిసా హీరోయిన్ గా సంయుక్త కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది.

ఈ సినిమా ను వచ్చే ఏడాది సమ్మర్ లో విడుదల చేసేందుకు గాను నందమూరి కళ్యాణ్ రామ్ ప్రయత్నాలు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.ఇక ఈ సినిమా టీజర్ ను ఈ నెల 29వ తారీఖున విడుదల చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు.

ఉదయం 9 గంటల 13 నిమిషాలకు సినిమా టీజర్ ను విడుదల చేయబోతున్నట్లు ఎన్ టి ఆర్ ఆర్ట్స్ బ్యానర్ వారు అధికారికంగా ప్రకటించారు.

నందమూరి కళ్యాణ్ రామ్ ఈ సినిమాకు దాదాపుగా 50 కోట్ల బడ్జెట్ ఖర్చు చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి.కళ్యాణ్ రామ్ మార్కెట్ 10 నుంచి 15 కోట్లు మాత్రమే ఉంటుంది.అయినా కూడా సినిమా కంటెంట్ పై నమ్మకం తో ఏకంగా 50 కోట్లను ఖర్చు చేశాడు అంటూ సమాచారం అందుతోంది.

నందమూరి ఫ్యామిలీ హీరోలు ఈ సినిమా ప్రమోషన్ కోసం ఒక అడుగు ముందుకు వస్తే కచ్చితంగా పాతిక నుంచి 30 కోట్ల వరకు వసూలు దక్కించుకునే అవకాశం ఉంటుంది.మిగిలిన మొత్తం ను శాటిలైట్ మరియు డిజిటల్ రైట్స్ ద్వారా దరక్కించుకునే అవకాశం ఉంది.

మొత్తానికి బింబిసారా సినిమా ఓ రేంజ్లో ఉంటుందని నమ్మకం అయితే నందమూరి అభిమానుల్లో కనిపిస్తుంది.మరి కళ్యాణ్ రామ్ ఈసారైనా నందమూరి అభిమానులకు సర్‌ ప్రైజ్ ఇచ్చి సక్సెస్ అవుతాగా అనేది చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube