బింబిసార టీజర్‌ టాక్.. చివర్లో మైండ్ బ్లోయింగ్‌ ట్విస్ట్‌

Nandamuri Kalyan Ram Bimbisara Movie Tease

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా తెరకెక్కిన బింబిసారా ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైంది.వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల కాబోతున్న ఈ సినిమాను ప్రేక్షకులు భారీ ఎత్తున ఆశలు వ్యక్తం చేస్తూ ఉన్నారు.

 Nandamuri Kalyan Ram Bimbisara Movie Tease-TeluguStop.com

నందమూరి కళ్యాణ్ రామ్ చాలా కాలంగా సక్సెస్ కోసం వెయిట్ చేస్తున్నాడు.ఎట్టకేలకు ఈ సినిమాతో కచ్చితంగా సక్సెస్ అవుతుందనే నమ్మకాన్ని కొందరు వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం బింబిసారా సినిమాకు ఉన్న బజ్‌ నేపథ్యంలో భారీగా బిజినెస్ అవుతుందని అంతా అనుకుంటున్నారు.ఈ సమయంలోనే సినిమా టీజర్ వచ్చింది.

 Nandamuri Kalyan Ram Bimbisara Movie Tease-బింబిసార టీజర్‌ టాక్.. చివర్లో మైండ్ బ్లోయింగ్‌ ట్విస్ట్‌-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బింబిసార సినిమా టీజర్ లో నందమూరి కళ్యాణ్ రామ్ లుక్‌ మరియు ఆయన స్టైల్ కూడా అద్భుతంగా ఉన్నాయి అంటూ కామెంట్స్ వస్తున్నాయి.ముఖ్యంగా రాజ దర్బార్ లో ముసలి పై నడిచే సీన్ అద్భుతంగా పండింది అంటున్నారు.

టీజర్‌ చివర్లో కళ్యాణ్ నార్మల్ లుక్ లో కనిపించడం మరింత ట్విస్ట్‌ గా అనిపిస్తుంది.ఒక్కసారి రాజు కాస్త నార్మల్ గా కనిపించడం ఏంటి అంటున్నారు.మొత్తానికి ఈ కథ ఏంటి, అసలు ఆ కాలానికి కాలానికి సంబంధం ఉందా, ఎందుకు కళ్యాణ్ రామ్ రెండు పాత్రల్లో కనిపించబోతున్నాడు దర్శకుడు, ఈ సినిమాతో ఏం చూపించబోతున్నాడు అనేది సస్పెన్స్గా మారింది, టీజర్‌ ను భారీ ఎత్తున విడుదల చేయడం జరిగింది.

అఖండ సినిమా ప్రదర్శించబడుతున్న ప్రతి ఒక్క థియేటర్ లో కూడా ఈ సినిమా టీజర్ ని విడుదల చేయబోతున్నట్లు గా మేకర్ చెప్తున్నారు.కళ్యాణ్ రామ్‌ సక్సెస్ కరువు ఈ సినిమా తో ముగుస్తుందనే నమ్మకంను ఇండస్ట్రీ వర్గాల వారు వ్యక్తం చేస్తున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్‌ రాజు గా చక్కని రూపంలో కనిపిస్తున్నాడంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

#Akhanda #Dual Role #Bimbisara

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube