కళ్యాణ్ రామ్‌ మళ్లీ కన్ఫర్మ్ చేశాడు.. బిగ్ ఫైట్‌ తప్పదా?

కరోనా వల్ల పెద్ద సినిమాలు మరియు చిన్న సినిమా లు అన్ని కూడా విడుదల వాయిదాల మీద వాయిదాలు పడుతూ వచ్చి ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.ఇప్పుడు పెద్ద సినిమా లతో మరియు చిన్న సినిమా లతో బాక్సాఫీస్ సందడి కనిపిస్తోంది.

 Nandamuri Kalyan Ram Bimbisara Movie Release Date , Bimbisara, Flim News, Kalyan Ram, News In Telugu, Sr Ntr 100th Birth Aniversary-TeluguStop.com

ఆగస్టు వరకు వరుసగా సినిమా లు రాబోతున్నాయి.ముఖ్యంగా ఆగస్టు లో చాలా పెద్ద సినిమా లు విడుదల కాబోతున్నాయి.

వారంలో ఒకటి రెండు పెద్ద సినిమా ల రాక కన్ఫర్మ్‌ అయ్యింది.పెద్ద ఎత్తున అంచనాలున్న బింబిసార సినిమా ను ఆగస్టు లో విడుదల చేయబోతున్నట్లుగా కొన్ని నెలల క్రితమే హీరో కళ్యాణ్‌ రామ్‌ ప్రకటించిన విషయం తెల్సిందే.

కళ్యాణ్‌ రామ్‌ హీరోగా రూపొందిన బింబిసార సినిమా చాలా విభిన్నంగా ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకునే విధంగా.ఆకర్షణీయంగా ఉంటుందనే నమ్మకం వ్యక్తం అవుతోంది.

కనుక ఆగస్టు లో విడుదల కాబోతున్న సినిమా పై అంచనాలు ఉన్నాయి.అయితే ఆగస్టు లో పెద్ద సినిమా లు విడుదల ఉన్న కారణంగా బింబిసార విడుదల ఆలస్యం చేసే అవకాశాలు ఉన్నాయంటూ వార్తలు వస్తున్నాయి.

బింబిసార సినిమా విడుదల విషయంలో కాస్త ఉన్న గందరగోళం కు తెర పడింది.ఆగస్టు లోనే సినిమా ను విడుదల చేస్తాం అంటూ హీరో క్లారిటీ ఇచ్చాడు.

ఎన్టీఆర్‌ యొక్క 100వ జయంతి సందర్బంగా నందమూరి అభిమానుల కోసం బింబిసార పోస్టర్‌ ను యూనిట్‌ సభ్యులు విడుదల చేశారు.ఈ సందర్బంగా కళ్యాణ్ రామ్‌ బింబిసార ఖచ్చితంగా ఆగస్టు 5న విడుదల కాబోతున్నట్లుగా క్లారిటీ ఇచ్చారు.

బింబిసార సినిమా తో కళ్యాణ్ రామ్‌ కు చాలా కాలం తర్వాత ఒక భారీ విజయం దక్కబోతుంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube