నందమూరి అభిమానులకు కళ్యాణ్ రామ్ గుడ్ న్యూస్ చెప్పాడు తన అమిగోస్ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి తమ్ముడు ఎన్టీఆర్ హాజరు కాబోతున్నట్లుగా ప్రకటించాడు.నిన్న ఈ చిత్రం యొక్క ట్రైలర్ విడుదల కార్యక్రమం జరిగింది.
ఆ సందర్భంగా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి తమ్ముడు ఎన్టీఆర్ హాజరు కాబోతున్నాడు.ఆ సందర్భంగా అన్ని విషయాలను మాట్లాడుకుందాం అంటూ అభిమానులకు మరియు మీడియా కు కళ్యాణ్ రామ్ చెప్పాడు.
దాంతో గత కొన్ని రోజులుగా ఉన్న సస్పెన్స్ కి తెర పడ్డట్లు అయింది.తారకరత్న హాస్పిటల్ లో ఉన్న కారణంగా ఈ చిత్రం యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ జరగక పోవచ్చు అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేశారు.

ఆ అనుమానాలు అన్నింటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టారు.కళ్యాణ్ రామ్ అధికారికంగా ప్రకటించడం తో నందమూరి అభిమానులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు.గతం లో కళ్యాణ్ రామ్ నటించిన బింబిసారా సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో కూడా ఎన్టీఆర్ సందడి చేశాడు.దాంతో ఆ సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది.
కనుక సెంటిమెంట్ ప్రకారం ఈ సినిమా కూడా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని నమ్మకాన్ని ప్రతి ఒక్కరు వ్యక్తం చేస్తున్నారు.

ఇక ఎన్టీఆర్ తన సినిమా యొక్క అప్డేట్ ని కూడా రేపు అమిగోస్ సినిమా యొక్క ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా రివీల్ చేసే అవకాశం ఉందని అభిమానులు చాలా నమ్మకం తో వెయిట్ చేస్తున్నారు.ఎన్టీఆర్ మరియు కళ్యాణ్ రామ్ ఇటీవల బెంగళూరు నారాయణ హృదయాలయ హాస్పిటల్ కి వెళ్లి తారకరత్న ను పరామర్శించిన విషయం తెలిసిందే.రేపు ప్రీ రిలీజ్ కార్యక్రమం లో తారకరత్న యొక్క ఆరోగ్య పరిస్థితి పై కూడా ఈ నందమూరి బ్రదర్స్ ఒక ప్రకటన చేసే అవకాశం ఉందని తెలుస్తోంది.
