అఖండ, ఆర్ఆర్ఆర్, బింబిసార.. నందమూరి హీరోల రేంజ్ మారిపోయిందిగా?

టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి ఫ్యామిలీకి ప్రత్యేకత ఉంది.దర్శకులను నమ్మి సినిమా ఛాన్స్ ఇచ్చే నందమూరి హీరోలు కథ ఫైనల్ అయిన తర్వాత స్క్రిప్ట్ లో వేలు పెట్టరని ఇండస్ట్రీలో టాక్ ఉంది.

 Nandamuri Heroes Range Changed With These Movies Details Here Goes Viral , Bimbisara, Nandamuri Heroes, Jr Ntr , Rrr ,success Track,balakrishna, Kalyan Ram,akanda-TeluguStop.com

గత కొన్నేళ్లుగా తారక్ వరుస విజయాలను సొంతం చేసుకుంటూ ఉండగా బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ మాత్రం కెరీర్ విషయంలో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నారు.అయితే అఖండ సినిమాతో బాలయ్య కెరీర్ లో గతేడాది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ చేరింది.

బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా బాలయ్య కెరీర్ లోనే హైయెస్ట్ కలెక్షన్లను సొంతం చేసుకోవడంతో పాటు 2021 బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్లలో ఒకటిగా నిలిచింది.అఖండ రిలీజైన మూడు నెలల తర్వాత చరణ్, తారక్ కలిసి నటించిన భారీ బడ్జెట్ మూవీ ఆర్ఆర్ఆర్ థియేటర్లలో విడుదలైంది.

 Nandamuri Heroes Range Changed With These Movies Details Here Goes Viral , Bimbisara, Nandamuri Heroes, Jr Ntr , Rrr ,success Track,Balakrishna, Kalyan Ram,akanda-అఖండ, ఆర్ఆర్ఆర్, బింబిసార.. నందమూరి హీరోల రేంజ్ మారిపోయిందిగా-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఈ సినిమా ఏకంగా 1200 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లను సొంతం చేసుకుంది.ఈ సినిమా సక్సెస్ తో చాలామంది బాలీవుడ్ సెలబ్రిటీలు తారక్ అభిమానులుగా మారిపోయారు.

తారక్ తో ఒక్క సినిమా అయినా చేయాలని పలువురు బాలీవుడ్ హీరోయిన్లు ఆశ పడుతున్నారు.పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సొంతం చేసుకున్న తారక్ తర్వాత ప్రాజెక్ట్ లతో కూడా విజయాలను సొంతం చేసుకుంటానని నమ్మకంతో ఉన్నారు.

మరో నందమూరి హీరో కళ్యాణ్ రామ్ బింబిసార సినిమాతో కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను సొంతం చేసుకున్నారు.ఈ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో కళ్యాణ్ రామ్ ఫ్యాన్స్ సంతోషిస్తున్నారు.

బింబిసార సినిమా నెక్స్ట్ లెవెల్ లో ఉందని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.వరుస హిట్లతో నందమూరి హీరోల రేంజ్ మారిపోయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.2021 2022 సంవత్సరాలు నందమూరి నామ సంవత్సరాలు అని నెటిజన్లు కామెంట్లు చేస్తుండటం గమనార్హం.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube