ఇక ఫ్యాన్స్ కు పండగే.. తెరపైకి నందమూరి హీరోల మల్టీస్టారర్ !

మన టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్ టి రామారావుతో మొదలైన నందమూరి కుటుంబం నుండి చాలా మంది హీరోలు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.సీనియర్ ఎన్టీఆర్ తర్వాత బాలకృష్ణ, హరికృష్ణ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు.

 Nandamuri Heroes Multistarrer Movie Announcement Soon-TeluguStop.com

కానీ బాలకృష్ణ మాత్రమే స్టార్ హీరోగా ఎదిగి ఇప్పటికి సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నాడు.ఆ తర్వాత జనరేషన్ లో కూడా నందమూరి కుటుంబం నుండి ఇండస్ట్రీ లోకి వచ్చారు.

అందులో ప్రస్తుతం ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రమే కొనసాగుతున్నారు.ఎన్టీఆర్ టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకడిగా పేరు సంపాదించుకున్నాడు.కళ్యాణ్ రామ్ మాత్రం ఇప్పటికి కెరీర్ లో నిలదొక్కుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు.అయితే అభిమానులు నందమూరి హీరోలను ఒకే స్క్రీన్ మీద చూడాలని ఎప్పటి నుండో ఆశగా ఎదురు చూస్తున్నారు.

 Nandamuri Heroes Multistarrer Movie Announcement Soon-ఇక ఫ్యాన్స్ కు పండగే.. తెరపైకి నందమూరి హీరోల మల్టీస్టారర్ -Gossips-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఇప్పటికే కొణిదెల కుటుంబం, అక్కినేని కుటుంబం మల్టీ స్టారర్ మూవీస్ చేయగా దగ్గుబాటి కుటుంబం కూడా మల్టీ స్టారర్ మూవీ ప్లాన్ చేసింది.అందుకే నందమూరి అభిమానులు కూడా వాళ్ళ అభిమాన హీరోలను ఒకే స్క్రీన్ మీద చూసి మురిసి పోవాలని ఆశపడుతున్నారు.అయితే వీరి ఆశ త్వరలోనే నిజమవ్వబోతుందని టాక్ నడుస్తుంది.త్వరలోనే నందమూరి హీరోలు ఒక మల్టీ స్టారర్ మూవీ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి.

బాలకృష్ణ, ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ కలిసి నటించే మల్టీ స్టారర్ సినిమాకు కూడా ప్రయత్నాలు సాగుతున్నాయని సమాచారం.అన్నీ అనుకున్నట్టు జరిగితే వచ్చే సంవత్సరం ఉగాది లోపు ఈ సినిమా అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశం ఉందని టాలీవుడ్ ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి.

ఇది ఇలా ఉండగా బాలకృష్ణ అఖండ సినిమాతో, ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ సినిమాతో, కళ్యాణ్ రామ్ రాజేంద్ర దర్శకత్వంలో ఒక సినిమా చేస్తూ బిజీగా ఉన్నారు.

#NandamuriHeroes #Kalyan Ram #Balakrishna #MultiStarrer

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు