నందమూరి వారసుల మ్యాజిక్ కు రంగం సిద్దం  

Nandamoori Heros Magic For New Year -

తెలుగు చిత్ర పరిశ్రమలో నందమూరి వారసులది సరికొత్త హవా అనే చెప్పుకోవాలి.అయితే ప్రస్తుతం ఆ వంశం నుంచి ప్రస్తుతం లైమ్ లైట్ లో ఉన్న హీరోలు ఎవరు అంటే ఒకరు నందమూరి బాలకృష్ణ, మరొకరు జూనియర్ ఎన్టీఆర్, ఇంకొకరు కల్యాణ్ రామ్.

అయితే వీళ్లంతా ఎవరి సినిమాల్లో వాళ్ళు బిజీ బిజేగా గడుపుతూ ఉన్నప్పటికీ తమ అభిమానులకు న్యూ ఇయర్ గిఫ్ట్ ఇచ్చేందుకు గాను తమ సినిమాలతో సర్వం సిద్దం చేస్తున్నారు.ఇప్పటికే బాలయ్య తన 98వ చిత్రం యొక్క ట్రైలర్ కమ్ టీజర్ ను ఈ అర్థరాత్రి 11:48 నిమిషాలకు విడుదల చేయడానికి ముహూర్తం ఫిక్స్ చేసుకోగా, మరో పక్క కల్యాణ్ రామ్ సైతం తన పాటాస్ యొక్క ట్రైలర్ ను అదే సమయానికి విడుదల చేసేందుకు రెడీ గా ఉన్నాడు.ఇక యంగ్ టైగర్ సైతం అదే బాటలో తన రాబోయే చిత్రం టెంపర్ యొక్క ట్రైలర్, టీజర్ రెండింటినీ ఒకేసారి విడుదల చేసి అభిమానుల్లో జోష్ ను నింపాలని ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.మరి రాబోయే 2015 అందరికి బావుండాలి అని, తెలుగు చలన చిత్ర పరిశ్రమ హిట్ సినిమాలతో కళకళలాడాలని ఆశిద్దాం.

Nandamoori Heros Magic For New Year -Nandamoori Heros Magic For New Year - --Telugu Tollywood Photo Image

ఇంకా లేట్ ఎందుకు నందమూరి అభిమానులు లెట్స్ వెయిట్ అండ్ వాచ్ 3ట్రైలర్స్.

తాజా వార్తలు

Nandamoori Heros Magic For New Year- Related....