నందమూరి హరికృష్ణ వైసీపీలో చేరబోతున్నాడా ..? అయితే టీడీపీ పరిస్థితి ఏంటి..?       2018-06-29   02:45:36  IST  Bhanu C

తెలుగుదేశం అంటే నందమూరి కుటుంబం… నందమూరి కుటుంబం అంటేనే తెలుగుదేశం. టీడీపీని స్థాపించిన ఎన్టీఆర్ ఇంటిపేరుతో ఆ పార్టీ బంధం అలా పెనవేసుకుపోయింది. ఆ తరువాత మారిన రాజకీయ మార్పులు కారణంగా నందమూరి కుటుంబం హవా క్రమంగా తగ్గి నారా కుటుంబం హవా పెరిగింది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే.. ? గత కొంతకాలంగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్న నందమూరి హరికృష్ణ మళ్లీ తెరమీదకు వచ్చారు.

కొన్నాళ్లుగా తెదేపా లో ప్రాధాన్యం లేకుండా ఉంటూ పార్టీ కార్యక్రమాలకు ఏదో మొక్కుబడిగా హాజరవుతూ ఉన్నారు. అసలు పార్టీ లో అవమానాలు తట్టుకోలేక ఎప్పటినుండో పార్టీ మారాలని చూస్తున్న హరికృష్ణ వీలైనంత తొందరగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని చూస్తున్నాడట. ఇప్పటికే హరికృష్ణ ఫ్యామిలీకి అత్యంత సన్నిహితుడిగా పేరుపొందిన గుడివాడ ఎమ్యెల్యే కోడలి నాని కూడా వైసీపీలో ఉండడంతో వైసీపీపై కొంతమేర సానుకూల దృక్పధం ఏర్పడిందని తెలుస్తోంది.

ఈ మేరకు వైసిపి అధినేత జగన్ ను హైదరాబాద్ లోని ఆయన నివాసంలో కలుసుకునేందుకు హరికృష్ణ ప్రయత్నిస్తున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం ప్రజా సంకల్పయాత్రలో వున్న జగన్ ప్రతి శుక్రవారం హైదరాబాద్ వస్తుండడంతో ఆ సమయంలోనే జగన్ ని కలిసి వైసీపీలో చేరే విషయమై చర్చించాలని హరికృష్ణ ప్లాన్ చేసుకుంటున్నాడట. చంద్రబాబు ప్లాన్ లో భాగంగా టీడీపీలో ఆయనకు గానీ , జూనియర్ ఎన్టీఆర్ కి కానీ సరైన స్థానం కల్పించకపోవడమే కాకుండా పార్టీ నుంచి దూరం పెట్టె పరిస్థితులు కల్పిస్తుండడంతో చాలాకాలంగా హరికృష్ణ గుర్రుగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన వైసీపీలోకి రావడం ఖాయం అనే సంకేతాలు వస్తున్నాయి. ఇదే కనుక జరిగితే టీడీపీ రాజకీయంగా విమర్శలు ఎదుర్కోవాల్సిందే.