నందమూరి ఫ్యాన్స్ కి క్యూరియాసిటీ పెంచుతున్న ఎన్టీఆర్-బన్సాలీ కాంబినేషన్

నందమూరి ఫ్యామిలీ నుంచి సీనియర్ ఎన్టీఆర్ పోలికలతో తారక్ ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించి హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యాడు.నటుడుగా వందకి వంద మార్కులు వేసుకున్న ఎన్టీఆర్ తన డాన్స్ టాలెంట్ కూడా మెప్పించి స్టార్ హీరోగా ఎదిగాడు.

 Nandamuri Fans Waiting For Jr Ntr And Bhansali Combination, Tollywood, Bollywood-TeluguStop.com

ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోలలో బెస్ట్ డాన్సర్ గా, అలాగే బెస్ట్ యాంకర్ గా తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్నాడు.ఇక చాలా కాలం నుంచి ఫ్లాప్ అనేది లేకుండా వరుసగా సూపర్ హిట్స్ ని ఖాతాలో వేసుకుంటూ తారక్ సినిమాల పరంపర కొనసాగిస్తున్నాడు.

ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో చేస్తున్న ఆర్ఆర్ఆర్ మీద భారీ అంచనాలు ఉన్నాయి.పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న సినిమా కావడంతో ఇండియన్ వైడ్ గా ఈ సినిమాతో తారక్ స్టామినా ఏంటో అందరికి తెలుస్తుంది అని నందమూరి ఫాన్స్ భావిస్తున్నారు.

దీని తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో చేస్తున్న మూవీ కూడా పాన్ ఇండియా ప్రాజెక్ట్ కావడంతో దానిమీద కూడా భారీగానే అంచనాలు ఉన్నాయి.

కొరటాల తర్వాత కేజీఎఫ్ స్టార్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో మూవీ చేయనున్నాడు.

ఇక ఈ రెండు సినిమాలు ఒక ఎత్తైతే ఎప్పటి నుంచి వినిపిస్తున్న మరో ప్రాజెక్ట్ ఎన్టీఆర్-సంజయ్ లీలా బన్సాలీ కాంబినేషన్.బాలీవుడ్ స్టార్ దర్శకుడు బన్సాలీ ఎప్పటి నుంచో సౌత్ హీరోతో ఒక సినిమా చేయాలని భావిస్తున్నారు.

పీరియాడికల్ లవ్ స్టొరీలని తనదైన శైలిలో ఆవిష్కరించే బన్సాలీకి బాలీవుడ్ లో వరుస హిట్స్ ఉన్నాయి.ప్రస్తుతం అలియా భట్ తో చేస్తున్న గంగూబాయ్ ఖతియావాడి సినిమా రిలీజ్ కి రెడీ అవుతుంది.

ఇక తారక్ పాన్ ఇండియా స్టార్ గా మారుతుండటంతో అతనితో ఒక రాజుల కాలంనాటి కథాంశంతో ఓ భారీ పీరియాడికల్ మూవీ చేయడానికి బన్సాలీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది.ఇప్పటికే తారక్ కి స్టొరీ కూడా నేరేట్ చేయడం జరిగిందని అతను కూడా ఒకే చెప్పాడని టాక్.

అయితే దీనిపై అఫీషియల్ ప్రకటన కోసం ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.నిజంగా బన్సాలీ-తారక్ కాంబోలో మూవీ అంటే కచ్చితంగా అదొక ట్రెండ్ అవుతుందని భావిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube