నందమూరి ఫ్యాన్స్ ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం వెయిట్ చేస్తున్నారు.భారీ అంచనాల నడుమ రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఆర్ఆర్ఆర్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడం ఖాయం.
కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ కనిపించబోతున్నాడు.ఇప్పటికే కొమురం భీమ్ లుక్ ను రివీల్ చేశారు.
కొమురం భీమ్ ముస్లీం క్యాప్ ఎందుకు పెట్టుకున్నాడు అంటూ ఇప్పటికే చాలా మంది విమర్శలు చేస్తున్నారు.ఈ సమయంలో ఎన్టీఆర్ అభిమానులు మాత్రం తదుపరి సినిమా విషయంలో ఆలోచనల్లో పడ్డారు.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్ తో త్రివిక్రమ్ సినిమా చేయాల్సి ఉంది.కాని కరోనా కారణంగా ఆర్ఆర్ఆర్ ఆలస్యం అయ్యింది.
ఆ కారణంగా ఏడాది పాటు సినిమా ఆలస్యం అవుతుంది.కనుక ఎన్టీఆర్ తదుపరి సినిమాకు ఇప్పట్లో డేట్లు ఇచ్చే అవకాశం లేదని అంటున్నారు.
అల వైకుంఠపురంలో వంటి బిగ్గెస్ట్ హిట్‌ను దక్కించుకున్న తర్వాత ఎన్టీఆర్ కోసం ఏడాది పాటు వెయిట్ చేయడం అవివేకం అవుతుందనే ఉద్దేశ్యంతో త్రివిక్రమ్ తదుపరి సినిమాను రామ్ తో చేయబోతున్నట్లుగా అతి త్వరలో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉంది.ప్రస్తుతం వీరిద్దరు కూడా ఖాళీగా ఉన్నారు.
వీరు మాత్రమే జత కట్టేందుకు అవకాశం ఉంది.ఒక వేళ రామ్ తో త్రివిక్రమ్ సినిమా మొదలైతే ఆర్ఆర్ఆర్ మూవీ ముగిసిన వెంటనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సినిమాకు ఎన్టీఆర్ రెడీ అయ్యే అవకాశం ఉంది.
కేజీఎఫ్ వంటి బిగ్గెస్ట్ మూవీతో పాన్ ఇండియా డైరెక్టర్ అయిన ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్‌తో మూవీ చేయబోతున్నాడు.ఆ సినిమాకు సంబంధించి ఇప్పటికే ప్రకటన కూడా వచ్చేసింది.
త్రివిక్రమ్ మూవీ ఆలస్యం అయితే వెంటనే కేజీఎఫ్ డైరెక్టర్ కు ఎన్టీఆర్ సిద్దం అయ్యే అవకాశం ఉంది.ఈ విషయమే క్లారిటీ కోసం నందమూరి ఫ్యాన్స్ వెయిటింగ్.