బాలయ్య ప్రకటనతో ఫ్యాన్స్‌ కొంచెం ఇష్టం కొంచెం కష్టం

నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్బంగా తనయుడు మోక్షజ్ఞ ఎంట్రీ గురించి క్లారిటీ ఇచ్చాడు.మోక్షజ్ఞ మొదటి సినిమా లో తాను ఉండబోతున్నట్లుగా బాలయ్య ప్రకటించడంతో పాటు అది ఆదిత్య 369 సినిమాకు సీక్వెల్‌ అన్నట్లుగా కూడా ప్రకటించాడు.

 Nandamuri Fans Not Happy With Balakrishan And Mokshagna Movie News-TeluguStop.com

సినిమాలో తండ్రి కొడుకులుగా కాకుండా ఇద్దరు హీరోలుగా మోక్షజ్ఞ మరియు తాను నటించబోతున్నట్లుగా బాలయ్య ప్రకటించడం వరకు బాగానే ఉంది.కాని ఆ తర్వాత ఆయన చెప్పిన విషయమే కాస్త ఆందోళన కలిగిస్తు ఉందని ఇండస్ట్రీ వర్గాల వారితో పాటు అభిమానులు కూడా అంటున్నారు.

ఇంతకు ఏంటీ అంటే బాలయ్య స్వయంగా ఆదిత్య 369 సినిమా కు కథను రాశాడట.ఇప్పటికే కథను సిద్దం చేసిన బాలయ్య త్వరలోనే సినిమా ను కూడా మొదలు పెట్టబోతున్నట్లుగా చెప్పాడు.

 Nandamuri Fans Not Happy With Balakrishan And Mokshagna Movie News-బాలయ్య ప్రకటనతో ఫ్యాన్స్‌ కొంచెం ఇష్టం కొంచెం కష్టం-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

బాలయ్య కథ ను రాశాడంటే అది ఎలా ఉంటుందో అనే అనుమానంను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

Telugu Aditya 369 Movie, Balakrishna, Balakrishna Son Mokshagna, Film News, Mokshagna, Movie News-Movie

సరే కథ మాత్రమే అనుకుంటే సింగీతం ఆసక్తి చూపించకుంటే తానే డైరెక్షన్‌ కూడా చేస్తానంటూ ప్రకటించాడు.దాంతో బాలయ్య డైరెక్షన్‌ లో సినిమా అంటే ఎలారా బాబోయ్‌ అన్నట్లుగా కొందరు కామెంట్స్‌ చేస్తున్నారు.బాలయ్య మరియు మోక్షజ్ఞ సినిమా ను ఇండస్ట్రీ వర్గాల వారు చాలా కాలంగా కోరుకుంటున్నారు.

అభిమానులు అయితే ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా అంటూ ఎదురు చూస్తున్నారు.మొత్తానికి ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంటుందని అభిమానులు భావించారు.

కాని ఇప్పుడు బాలయ్య ప్రకటనతో అనుమానం మొదలు అయ్యింది.మోక్షజ్ఞ తనతో కలిసి నటిస్తాడు అంటూ గుడ్‌ న్యూస్ చెప్పిన బాలయ్య ఆ వెంటనే ఆ సినిమా కు దర్శకత్వం నేనే వహిస్తాను.

కథను ఇప్పటికే రాశాను అంటూ చెప్పడం కాస్త ఆందోళన కలిగిస్తుందని అది కష్టంగా కూడా ఉందంటూ అభిమానులు మరియు నెటిజన్స్ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

#Mokshagna #Balakrishna #BalakrishnaSon

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు