కొడాలి నాని వంశీలపై నందమూరి వారసుడి ఆగ్రహం !  

Nandamuri Chitanya Krishna Warning-

తెలుగుదేశం పార్టీ మీద, ఆ పార్టీ నాయకుల మీద కొద్ది రోజులుగా విమర్శలు చేస్తూ ఏపీ రాజకీయాలను హీటేక్కిస్తున్నారు మంత్రి కొడాలి నాని, వల్లభనేని వంశీ.దీనికి టీడీపీ నుంచి గట్టి కౌంటర్ పడినా ఆ నేతలు ఇద్దరూ అస్సలు లెక్కచేయడంలేదు.ఒకదశలో జూనియర్ ఎన్టీఆర్ పేరుకూడా ప్రస్తావనకు వచ్చినా నందమూరి కుటుంబం నుంచి ఏ స్పందన లేకుండా పోయింది.తాజాగా నందమూరి జయకృష్ణ తనయుడు చైతన్యకృష్ణ కొడాలి నాని, వల్లభనేని వంశీల వ్యాఖ్యలను ఖండించారు.

Nandamuri Chitanya Krishna Warning- Telugu Political Breaking News - Andhra Pradesh,Telangana Partys Coverage Nandamuri Chitanya Krishna Warning--Nandamuri Chitanya Krishna Warning-

చంద్రబాబుపై అనవసర విమర్శలు చేస్తున్నారని, పార్టీ టికెట్ ఇచ్చి గెలిపించిన వ్యక్తిపై వ్యక్తిగతంగా దూషణలు చేయడం సరైన పద్ధతి కాదని చైతన్యకృష్ణ మండిపడ్డారు.ఈ మేరకు చైతన్యకృష్ణ ఓ వీడియో విడుదల చేశారు.అంతే కాదు ప్రస్తుతం నాని, వంశీ ఇప్పుడు ఈ స్థానంలో ఉన్నారంటే దానికి కారణం మా మావయ్య చంద్రబాబు.ఆయనను ఇష్టమొచ్చినట్టు విమర్శిస్తే ఊరుకునేది లేదంటూ హెచ్చరించారు.

పార్టీ పరంగా మీకు ఏవైనా వ్యతిరేకత ఉంటే ఎక్కడివరకు చూసుకోండి కానీ వ్యక్తిగత విమర్శకు దిగితే సహించేది లేదంటూ హెచ్చరించారు చైతన్య కృష్ణ.