లక్ష్మీపార్వతి మా ఫ్యామిలీలోకి వచ్చిన శని.. బాబు తర్వాత బాలయ్యే సీఎం.. చైతన్య కృష్ణ కామెంట్స్ వైరల్!

నందమూరి హీరోలకు( Nandamuri heroes ) ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ అంతాఇంతా కాదు.నందమూరి చైతన్యకృష్ణ( Nandamuri Chaitanya Krishna ) బ్రీత్ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి రీఎంట్రీ ఇస్తున్నారు.

 Nandamuri Chaitanya Krishna Comments Goes Viral In Social Mdia Details Here ,-TeluguStop.com

గతంలో ఒక సినిమాలో నటించిన చైతన్యకృష్ణ బ్రీత్ సినిమాతో సక్సెస్ ను అందుకుంటానని కాన్ఫిడెన్స్ తో ఉన్నారు.లక్ష్మీపార్వతి మా ఫ్యామిలీలోకి వచ్చిన శని అంటూ చైతన్యకృష్ణ కామెంట్లు చేశారు.

చంద్రబాబు( Chandrababu ) తర్వాత బాలయ్య సీఎం అవుతారని ఆ తర్వాత లోకేశ్ సీఎం అని చైతన్యకృష్ణ పేర్కొన్నారు.

బాలయ్య పాలిటిక్స్ లో ఉన్నారని సినిమాలతో పాటు రాజకీయాలను బాలయ్య( Balayya ) హ్యాండిల్ చేస్తున్నారని చైతన్యకృష్ణ చెప్పుకొచ్చారు.

బాలయ్య పూర్తిస్థాయిలో రాజకీయాలలో లేకపోయినా చంద్రబాబు జైలులో ఉన్న సమయంలో అక్క కుటుంబానికి అండగా నిలిచారని చైతన్యకృష్ణ చెప్పుకొచ్చారు.బ్రీత్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు నందమూరి కుటుంబానికి సంబంధించిన అందరినీ పిలుస్తున్నానని చైతన్య కృష్ణ అన్నారు.

నందమూరి కుటుంబం లక్ష్మీపార్వతిని( Lakshmi Parvati ) అస్సలు పట్టించుకోరని చైతన్యకృష్ణ పేర్కొన్నారు.చైతన్యకృష్ణ బ్రీత్ సినిమాకు నందమూరి జయకృష్ణ నిర్మాతగా వ్యవహరించారు.బసవతారకరామ క్రియేషన్స్ బ్యానర్ పై ఈ సినిమా తెరకెక్కింది.వంశీకృష్ణ ఆకెళ్ల ( Vamsikrishna Akella )డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది.డిసెంబర్ నెల 2వ తేదీన ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుండటం గమనార్హం.

వైద్య వ్యవస్థ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోందని తెలుస్తోంది.ఎమోషనల్ థ్రిల్లర్ గా ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ గా కూర్చోబెట్టేలా ఉంటుందని ఆయన అన్నారు.పెద్దగా అంచనాలు లేకుండా విడుదలవుతున్న ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుంది.

నందమూరి ఫ్యామిలీ సపోర్ట్ తో చైతన్య కృష్ణ సక్సెస్ సాధించాలని అభిమానులు భావిస్తున్నారు.నందమూరి చైతన్య కృష్ణ భారీ రేంజ్ లో ప్రమోషన్స్ చేస్తుండటం గమనార్హం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube