బాల బాబాయ్ ! ఎన్టీఆర్ ప్లస్సా మైనెస్సా ? దబిడి దిబిడా ?

బాల బాబాయ్ అంటూ ఆప్యాయంగా ఎన్టీఆర్ తన బాబాయ్ నందమూరి బాలకృష్ణ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు.అదే రోజు ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో జూనియర్ ఎన్టీఆర్ గురించి బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు.

 Nandamuri Balakrsihna Sensational Comments On Ntr-TeluguStop.com

అయితే అది అర్థమైన వాళ్లకు అర్థమైనంత.ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో యాక్టివ్ గా ఉంటున్న నందమూరి బాలకృష్ణ రెండో సారి హిందూపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు.

అవకాశం దొరికితే టిడిపిలో కీలక స్థానంలో కూర్చునేందుకు బాలయ్య సిద్ధంగానే ఉన్నారు.ఆ విధంగా అప్పుడప్పుడూ సంకేతాలు ఇస్తున్నారు.

 Nandamuri Balakrsihna Sensational Comments On Ntr-బాల బాబాయ్ ఎన్టీఆర్ ప్లస్సా మైనెస్సా దబిడి దిబిడా -Political-Telugu Tollywood Photo Image-TeluguStop.com

అయితే చంద్రబాబు మాత్రం నారా లోకేష్ కు ఆ బాధ్యతలు అప్పగించాలని చూస్తుండడంతో బాలయ్య కూడా ఏం మాట్లాడలేని పరిస్థితి.కానీ లోకేష్ శక్తి సామర్థ్యాలపై సొంత పార్టీ నాయకుల లోనే పెద్దగా సదాభిప్రాయం లేకపోవడంతో పదే పదే పదే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన వస్తోంది.

ఎన్టీఆర్ టిడిపి బాధ్యతలు తీసుకోవాలంటూ ఆయన ఫ్యాన్స్ తో పాటు, టీడీపీ శ్రేణుల నుంచి డిమాండ్ లు వస్తున్నాయి.చంద్రబాబు ముందే ఈ ప్రతిపాదనలు, నినాదాలు రావడంతో ఆయన కూడా దీనిపై ఏం మాట్లాడలేని పరిస్థితి.

ఇదే అంశంపై ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో బాలయ్య కు ఎన్టీఆర్ నుంచి ప్రశ్న ఎదురయింది.జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశంపై మీ సమాధానం ఏమిటి అనే ప్రశ్నకు తనదైన శైలిలో సమాధానం చెప్పారు.

ఎన్టీఆర్ పార్టీ లోకి వస్తే టిడిపికి ప్లస్ అవుతుందని మీరు భావిస్తున్నారా అని ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పలేకపోయారు.

Telugu Balakrishna About Ntr Political Entry, Balayya Comebts Ntr Issue, Chandrababu, Jai Balayya, Jr Ntr, Nandamuri Balakrsihna, Nara Lokesh, Ntr Plus Or Minus For Tdp, Ntr Tdp, Tdp, Tdp Ntr-Telugu Political News

కొద్దిసేపు నవ్వుతూ , మరి కొద్దిసేపు మౌనంగా ఉంటూ బాలయ్య సమాధానాన్ని దాటవేసే ప్రయత్నం చేసినా, సదరు యాంకర్ అదే విషయంపై పట్టుబడుతూ వచ్చారు.

ఎన్టీఆర్ మళ్లీ టిడిపిలోకి రావడం ప్లస్ తర్వాత మైనస్ అయితే ఏంటని ప్రశ్నించారు .ప్లస్ మైనస్ ఆల్వేజ్ బ్యాడ్.ప్లస్ ఈజ్ ప్లస్ , మైనస్ ఈజ్ ప్లస్ అంటూ రక రకాలుగా బాలయ్య స్పందించారు.ముందు మైనస్ తర్వాత ప్లస్ అయినా పర్వాలేదని , కానీ ముందు ప్లస్ అయ్యి తర్వాత మైనస్ అయితే ఇబ్బంది అంటూ కన్ఫ్యూజన్ గా సమాధానం చెప్పారు.

అయితే నేరుగా ఎన్టీఆర్ వస్తే లాభమా నష్టమా అనే దానిపై స్పందించేందుకు ఇష్టపడలేదు.

Telugu Balakrishna About Ntr Political Entry, Balayya Comebts Ntr Issue, Chandrababu, Jai Balayya, Jr Ntr, Nandamuri Balakrsihna, Nara Lokesh, Ntr Plus Or Minus For Tdp, Ntr Tdp, Tdp, Tdp Ntr-Telugu Political News

బాలయ్య వ్యవహారం చూస్తే ఎన్టీఆర్ అవసరం టిడిపికి పెద్దగా లేదు అన్నట్లుగానే కనిపించింది .అసలు ఎన్టీఆర్ అంశంపై స్పందించేందుకు మాట్లాడేందుకు బాలయ్య చాలా గజిబిజి గందరగోళం చెందాల్సి వచ్చింది.ఎందుకంటే ఈ విషయంలో ఏ విధంగా సూటిగా స్పందించినా, బాలయ్యకు ఇబ్బందే.

  అటు జూనియర్ ఎన్టీఆర్, ఇటు చంద్రబాబు కావడంతో ప్లస్ మైనస్ మైనస్ ప్లస్ అంటూ గందరగోళానికి గురిచేసి తప్పించుకున్నట్టు కనిపిస్తున్నారు.అదే మరి బాలయ్య అంటే…!

.

#TDP NTR #Nara Lokesh #Chandrababu #Jai Balayya #BalayyaComebts

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు