టాలీవుడ్ యంగ్ హీరో అడవి శేష్ తాజాగా నటించిన చిత్రం హిట్ 2.శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా తాజాగా విడుదల అయ్యి మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.
తాజాగా విడుదల అయిన ఈ సినిమా ప్రముఖుల నుంచి ప్రశంసలను అందుకుంటోంది.నాచురల్ స్టార్ నాని ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.
హిట్ 2 సినిమా క్లైమాక్స్ లో హిట్ 3 ఉండబోతుందని అందులో నాని హీరోగా నటించబోతున్నారు అని ప్రకటించిన విషయం తెలిసిందే.ఇక ప్రస్తుతం చిత్ర బృందం సక్సెస్ మీట్ లో భాగంగా ఎంజాయ్ చేస్తున్నారు.
ఇది ఇలా ఉంటే తాజాగా అడివి శేష్,నాని బాలకృష్ణ కలిసి హిట్ 2 సినిమాను స్పెషల్ స్క్రీనింగ్ ద్వారా ప్రదర్శించారు.వీరి ముగ్గురితో కలిసి బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ కూడా సినిమాను వీక్షించాడు.
కాగా ఇదే విషయాన్ని అడవి శేష్ సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.బాలయ్య, మోక్షజ్ఞ, నాని తో కలసి దిగిన ఫోటోస్ ని అడివి శేష్ ట్విట్టర్ లో షేర్ చేశాడు.
ఈ సందర్బంగా అడివి శేష్ ట్వీట్ చేస్తూ.బాలయ్య సర్ కి హిట్ 2 సూపర్ గా నచ్చింది.
నా పెర్ఫామెన్స్ గురించి, దర్శకుడు శైలేష్ విజన్ గురించి ఆయన ఎంతగానో ప్రశంసించారు.హిట్ 2 సిరీస్ లో కామియో రోల్ ప్లే చేయాలని నేను బాలయ్య సర్ ని రిక్వెస్ట్ చేశాడు.
ఆయన చిరునవ్వు నవ్వి.ఏమో ఏం జరుగుతుందో చూద్దాం అన్నారు.
నందమూరి మోక్షజ్ఞ చాలా స్వీట్ కిడ్.మోక్షజ్ఞకి హిట్ 2 చాలా బాగా నచ్చింది అంటూ అడివి శేష్ ట్వీట్ చేశాడు.కాగా ఈ వార్త పై పలువురు అభిమానులు స్పందిస్తూ బాలయ్య బాబు తన తనయుడు మోక్షజ్ఞని ఈ విధంగా కొక్కరికి పరిచయం చేస్తున్నాడా అంటూ కామెంట్ల రూపంలో అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఈ విధంగా బాలయ్య ఒక్కొక్కరికి తన కొడుకు మోక్షజ్ఞని పరిచయం చేస్తూ ఆ తర్వాత హీరోగా సినీ ఇండస్ట్రీ ఎంట్రీ ఇప్పించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి.