బాలయ్య వారసుడుని హీరోగా చూసే అవకాశం లేనట్లేనా  

సినిమాలకి ఆసక్తి చూపించని బాలయ్య కొడుకు. .

Nandamuri Balakrishna Son Mokshajna Not Interested On Acting-

టాలీవుడ్ లో ఎన్టీఆర్ వారసుడుగా ఎంట్రీ ఇచ్చి మాస్ కమర్షియల్ సినిమాలతో స్టార్ హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సొంతం చేసుకున్న హీరో బాలకృష్ణ.ఇక బాలకృష్ణ అంటే డైలాగ్స్, డైలాగ్స్ అంటే బాలకృష్ణ అనేంతగా టాలీవుడ్ లో తన ప్రభావం చూపించిన బాలయ్య బాబు ఓ వైపు సినిమాలు చేస్తూ, మరో వైపు రాజకీయ నేతగా కూడా తన సత్తా చూపిస్తున్నారు.ఇదిలా బాలయ్య తర్వాత అతని వారసుడుగా మోక్షజ్న ఎంట్రీ టాలీవుడ్ లో ఉండబోతుంది అనే టాక్ చాలా కాలంగా వినిపిస్తుంది..

Nandamuri Balakrishna Son Mokshajna Not Interested On Acting--Nandamuri Balakrishna Son Mokshajna Not Interested On Acting-

ఇక బాలకృష్ణ కూడా చాలా సందర్భాలలో మోక్షజ్న ఎంట్రీ గురించి చెబుతూ వచ్చారు.ఇదిలా ఉంటే ఇప్పుడు మోక్షజ్న ఎంట్రీ గురించి టాలీవుడ్ లో ఓ ఆసక్తికరమైన వార్త వినిపిస్తుంది.హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి అస్సలు మోక్షజ్నకి ఇష్టం లేదని, ఈ గ్లామర్ ఫీల్డ్ కి వచ్చే ఆలోచన కూడా అతని లేదని సన్నిహితుల దగ్గర చెప్పినట్లు తెలుస్తుంది.

ఏదో తండ్రి బలవంతం మీద యాక్టింగ్ నేర్చుకోవాలని ప్రయత్నం చేసిన అది తన వలన కాదని బాలకృష్ణకి చెప్పినట్లు టాక్ వినిపిస్తుంది.ఈ నేపధ్యంలో బాలకృష్ణ కూడా కొడుకుని బలవంతం చేయడం ఇష్టం లేక తనకి నచ్చిన దారిలో వెళ్ళమని వదిలేసినట్లు తెలుస్తుంది.ఇక తాజాగా ఓ ఇంగ్లీష్ పత్రిక మోక్షజ్న గురించి మోక్షజ్న కేరాఫ్ కాఫీ షాప్ అనే ఆర్టికల్ ప్రచురించి టాలీవుడ్ లో వినిపిస్తున్న వార్తలకి మరింతం బలం అందించాయి.