నా మనవడు సీఎం అంటున్న బాలయ్య బాబు... కానీ..

తెలుగు సినిమా పరిశ్రమలో నందమూరి నటసింహం బాలకృష్ణ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజ్ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. అయితే బాలకృష్ణ ఆడియో ఫంక్షన్లు గాని లేదా ఇతర కుటుంబ ఫంక్షన్లకు హాజరైనప్పుడు బాగా అల్లరి చేస్తూ అందరినీ ఆట పట్టిస్తూ కలుపుగోలుగా ఉంటాడు.

 Nandamuri Balakrishna Shared Funny Incidents With Aryaveer, Aryaveer, Nandamuri-TeluguStop.com

 అయితే తాజాగా ఓ ప్రముఖ యూట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూ లో నందమూరి బాలకృష్ణ పాల్గొన్నాడు.ఇందులో భాగంగా తన కుటుంబానికి సంబంధించిన పలు ఆసక్తికర అంశాలను ప్రేక్షకులతో పంచుకున్నాడు.

అయితే ఇందులో ముఖ్యంగా తన చిన్న కూతురు తేజస్విని కొడుకు “ఆర్యవీర్” తన వద్దనే ఉంటున్నాడని దీంతో తాము ఇద్దరం కలిసి బాగా అల్లరి చేస్తామని తెలిపాడు.అంతేగాక తన మనవడు సీఎం అంటూ చెప్పుకొచ్చాడు.

 అయితే సీఎం అంటే “చీఫ్ మినిస్టర్” కాదని “చాలా మాస్” అని కవర్ చేశాడు. ఇక తన పెద్ద కూతురు నారా బ్రాహ్మణి క్రమశిక్షణకు పెట్టింది పేరని ఒక్కోసారి తనని కూడా క్రమశిక్షణగా ఉండాలంటూ సూచిస్తుందని కానీ తాను మాత్రం పెద్దగా పట్టించుకోనని సరదాగా నవ్వించాడు.

దేవాన్ష్ కూడా తల్లి మాదిరిగానే చాలా క్రమశిక్షణగా ఉంటాడని కానీ ఆర్యవీర్ మాత్రం అలా కాకుండా తన లాగే చాలా చలాకీగా ఉంటాడని చెప్పుకొచ్చాడు.ఇక తమ చిత్ర కథల ఎంపిక విషయంపై స్పందిస్తూ తాను దర్శకుడు బోయపాటి శ్రీను పై ఉన్నటువంటి నమ్మకంతో ఎప్పుడూ కూడా పూర్తి కథను వినని ఏదో రెండు, మూడు లైన్లు విని ఓకే చెప్పేస్తానని ఆ దర్శకుడు అంటే అంత నమ్మకమని చెప్పుకొచ్చాడు.

Telugu Aryaveer, Boyapati Sreenu, Devansh, Telugu, Tollywood-Latest News - Telug

అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ తెలుగులో బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఓ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఇక ఈ చిత్రంలో బాలయ్య బాబు అగోరా పాత్రలో కనిపించనున్నాడు.ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన మొదటి షెడ్యూల్ షూటింగ్ పనులు కూడా పూర్తయినట్లు చిత్ర యూనిట్ సభ్యులు అధికారికంగా తెలిపారు.గతంలో బోయపాటి – బాలయ్య ల కాంబినేషన్లో వచ్చిన సింహ, లెజెండ్ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఘన విజయాలను నమోదు చేసాయి.

దీంతో మరోసారి హిట్ కొట్టి హ్యాట్రిక్ విజయాల్ని నమోదు చెయ్యాలని చిత్ర యూనిట్ సభ్యులు బాగానే కష్ట పడుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube