అందుకే బాలయ్యను చిన్నపిల్లోడు అనేది.. ఎయిర్ పోర్ట్ లో చిలిపిచేష్టలు?

నందమూరి బాలకృష్ణ.తెలుగు సినీ పరిశ్రమలో తిరుగు లేని నటనా ప్రతిభను కనబరుస్తూ తన అత్యున్నతమైన వ్యక్తిత్వాన్ని చాటుకుంటున్న గొప్ప నటుడు.

 Nandamuri Balakrishna Plays With Bag In Air Port, Balakrishna, Tollywood, Tollyw-TeluguStop.com

వైవిధ్యభరితమైన పాత్రలు పోషించడమేకాక, పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలలో నటించిన నటుడిగా ప్రసిద్ధి చెందారు. బాలకృష్ణ పద్నాలుగేళ్ళ వయసులో తండ్రి ఎన్.టి.ఆర్ దర్శకత్వం వహించిన తాతమ్మకల (1974) చిత్రంతో వెండితెరకు పరిచయం అయ్యారు.మొదట్లో వివిధ సినిమాల్లో సహాయనటుడిగా కనిపించారు.ఆ తర్వాత తండ్రితో కలిసి చాలా చిత్రాల్లోనూ నటించారు బాలకృష్ణ.

సినీ పరిశ్రమలోనే కాక, రాజకీయ రంగంలోనూ తన సత్తా చూపిస్తున్న గొప్ప రాజకీయ నాయకుడిగా కూడా వెలుగొందుతున్నారు బాలకృష్ణ.అంతే కాకుండా 2014 శాసనసభ ఏన్నికలలో మొదటి సారి శాసనసభకు ఎన్నికయ్యారు.

ఆ తర్వాత 2019 లో రెండవ సారి శాసనసభకు ఎన్నికై మరోసారి తన అధికారాన్ని నిలుపుకున్నారు.

ఇక పోతే నందమూరి బాలకృష్ణ ఏం చేసినా ట్రెండింగ్ అవుతుందన్న విషయం అందరికీ తెలిసిందే.

ఒకసారి షూటింగ్ టైంలో ఎవరో అడ్డు వచ్చారని కొట్టారు.అప్పట్లో ఇలాంటి సంఘటనలు చాలానే జరిగాయి.అందుకే కొంత మంది ఆయనంటే భయపడుతుంటారు.ఒక తాజా విషయానికొస్తే.ఈ మధ్య కాలంలో ఆయన చేసిన ఒక పని చూపరులను తెగ నవ్విస్తోంది.అదేంటంటే ఒక ఎయిర్ పోర్ట్ లో తన బ్యాగ్ తో ఆడుకునే ఫన్నీ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అందుకే బాలకృష్ణ ఏం చేసినా కొత్తదనంగానే ఉంటుందని నెటిజన్లు కామెంట్లు చేయగా, మరి కొందరు అందుకే కదా బాలకృష్ణను చిన్న పిల్లోడు అనేది అంటూ తమదైన శైలిలో కామెంట్లు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube