బాలయ్యకు బీపీ చెకప్.. ఆ తర్వాత అందరూ?

నందమూరి నటసింహం బాలకృష్ణ తల్లి పేరు మీదుగా దాదాపు 20 సంవత్సరాల క్రితం బసవతారకం హాస్పిటల్ ని ఏర్పాటు చేశారు.అయితే ఫిబ్రవరి 4 క్యాన్సర్ దినోత్సవంగా బాలకృష్ణ బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రి ని సందర్శించారు.

 Nandamuri Balakrishna Participated In Cancer Awareness Program In Basavatarakam-TeluguStop.com

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ బసవ తారకం ఆస్పత్రి ఏర్పాటుచేసిన 20 సంవత్సరాలలోపు దాదాపు రెండున్నర లక్ష మంది క్యాన్సర్ తో బాధపడుతున్న వారికి వైద్య సేవలు అందిచామని తెలియజేశారు.క్యాన్సర్ వ్యాధి బారిన పడిన వారు వ్యాధి ముందుగా గ్రహించి ప్రారంభదశలోనే సరైన వైద్య చికిత్స చేయించుకోవడం వల్ల క్యాన్సర్ వ్యాధిని పూర్తిగా నివారించవచ్చని ఈ సందర్భంగా తెలియజేశారు.

ఫిబ్రవరి 4న ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం కావడంతో బసవతారకం ఆసుపత్రిలో ఇండో అమెరికన్ బసవతారకం ఆస్పత్రి, రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ – మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అధారిటీ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో క్యాన్సర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం దాదాపు కోటి మందికి పైగా ఈ వ్యాధి బారిన పడుతున్నారని,సరైన చికిత్స వల్ల ఈ వ్యాధిని నివారించవచ్చని తెలియజేశారు.

Telugu Balayya, Breast Cancer, Cancer, Checkup, February, Program-Movie

ఈ క్యాన్సర్ విషయంలో మహిళలు ఎంతో జాగ్రత్తలు అవసరమని వారిలో ముఖ్యంగా తలెత్తే గర్భాశయ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ గురించి అవగాహన చేసుకోవాలని తెలిపారు.మహిళలు ముఖ్యంగా ప్రతి సంవత్సరం క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలి.అదేవిధంగా పొగతాగడం, మద్యం సేవించడం వంటి అలవాట్లు ఉన్నవారు ఎక్కువగా ఈ వ్యాధి బారిన పడుతున్నారని అలాంటి అలవాట్లకు వీలయినంతవరకు దూరంగా ఉండటం వల్ల ఈ వ్యాధి నుంచి విముక్తి పొందవచ్చు అని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ సందర్భంగా బసవతారకం ఆస్పత్రి సందర్శించిన బాలకృష్ణకు అక్కడి వైద్యులు బీపీ పరీక్షలు నిర్వహించారు.

ఎప్పుడు హై ఎనర్జిటిక్ గా,లేదా ఎంతో సీరియస్ గా ఉండే బాలయ్య బిపీ ఏ స్థాయిలో ఉంటుందో అంటూ అక్కడి వైద్య సిబ్బంది ఎంతో సరదాగా చెబుతూ నవ్వుకున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube