బాలయ్య ‘NBK108’ టైటిల్ రివీల్ కు మాస్ ప్లాన్.. టాలీవుడ్ లో ఫస్ట్ టైం ఇలా..

Nandamuri Balakrishna Nbk108 Title Launch In 108 Locations

నందమూరి నటసింహం బాలకృష్ణ( Nandamuri Natasinham Balakrishna ) జూన్ 10న తన పుట్టిన రోజును( Birthday Balakrishna ) జరుపుకో నున్నారు అనే విషయం నందమూరి ఫ్యాన్స్ కు మాత్రమే కాదు తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా తెలుసు.ఈ క్రమంలోనే ప్రతీ ఏడాది లానే ఈ ఏడాది కూడా బాలయ్య బర్త్ డే రోజు వచ్చే ట్రీట్స్ కోసం నందమూరి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న తరుణంగా మేకర్స్ నుండి అదిరిపోయే న్యూస్ బయటకు వస్తూనే ఉన్నాయి.

 Nandamuri Balakrishna Nbk108 Title Launch In 108 Locations-TeluguStop.com

బాలకృష్ణ ప్రజెంట్ ఫుల్ స్వింగ్ లో ఉన్నారు.ఈయన అఖండ, వీరసింహారెడ్డి సినిమాల( Akhanda, Veerasimha Reddy movie ) తర్వాత తన 108వ సినిమాను చేస్తున్నాడు.

సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా బాలయ్యను ఎలా ప్రజెంట్ చేస్తారా అని ఫ్యాన్స్ ఈగర్ గా చూస్తున్నారు.ఈ సాలిడ్ ప్రాజెక్ట్ నుండి బాలయ్య పుట్టిన రోజు కానుకగా ఒక అప్డేట్ రాబోతుంది.

అంతకంటే ముందుగానే రేపు అంటే జూన్ 8న ఈ సినిమా నుండి టైటిల్ రాబోతున్నట్టు కొద్దిసేపటి క్రితమే మేకర్స్ అనౌన్స్ చేసారు.అయితే ఈ టైటిల్ అనౌన్స్ మెంట్( Title announcement ) అందరిలా కాకుండా కొత్తగా చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేసారు.ఇది బాలయ్య 108వ సినిమా కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో 108 హోర్డింగ్స్ ఏర్పాటు చేసి ఈ మాస్ టైటిల్ ను రేపు లాంచ్ చేయనున్నట్టు అనౌన్స్ చేశారు.

ఇప్పటి వరకు టాలీవుడ్ లో ఇలాంటి ప్రమోషన్స్ జరగలేదని మేకర్స్ సైతం చెబుతున్నారు.

చూడాలి ఎలాంటి టైటిల్ ప్రకటిస్తారో.ఇక ఈ సినిమాలో బాలయ్యకు జోడీగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.

బాలయ్య కూతురు పాత్రలో శ్రీలీల కనిపిస్తున్న విషయం విదితమే.అలాగే ఈ సినిమాలో విలన్ గా బాలీవుడ్ స్టార్ అర్జున్ రాంపాల్ నటిస్తుండగా ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ వారు నిర్మిస్తున్నారు.

ఎస్ ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ కాబోతుంది.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube