జేపీ కుటుంబంకు బాలకృష్ణ సాయం

టాలీవుడ్‌ ప్రముఖ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌.విలన్‌.

 Nandamuri Balakrishna To Give 10lakhs To Jp Family, Jaya Prakash Reddy, Baalkris-TeluguStop.com

కమెడియన్‌ మంచి మనిషి అయిన జయప్రకాష్‌ రెడ్డి మృతి చెందడం సినీ అభిమానులకు మరియు ప్రముఖులకు శోకంను మిగిల్చింది.ఆయన ఇంకా ఎన్నో సంవత్సరాలు సినిమాలు చేస్తూ అందరిని నవ్విస్తాడని అనుకున్నాం.

కాని ఆయన అనూహ్యంగా బాత్‌ రూంలో గుండె పోటుతో మృతి చెందడటంతో దిగ్ర్బాంతికి లోనయ్యారు.జేపీతో తమ అనుబంధాన్ని షేర్‌ చేసుకుని చాలా మంది స్టార్‌ హీరోలు సోషల్‌ మీడియా ద్వారా షేర్‌ చేశారు.

జేపీతో దాదాపు అందరు స్టార్‌ హీరోలకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయి.అందులో ఎలాంటి సందేహం లేదు.

ఆ కారణంగానే ఆయన అంత్యక్రియలు వెళ్లలేక పోతున్నాం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక నందమూరి బాలకృష్ణ తో జేపీ చేసిన సినిమాల గురించి చెప్తే ఒక రోజంతా పడుతుంది.

బాలకృష్ణకు అద్బుతమైన ఫ్యాక్షన్‌ ఇమేజ్‌ వచ్చింది అంటే అది ఖచ్చితంగా సమర సింహారెడ్డి సినిమా అని చెప్పడంలో సందేహం లేదు.ఆ సినిమాలో జేపీ విలన్‌గా కనిపించాడు.

ఆ సినిమాలో జేపీ అత్యంత క్రూరమైన పాత్రలో కనిపించాడు.అప్పటి నుండే బాలకృష్ణకు జేపీ అంటే అమితమైన అభిమానం.

అంతకు ముందు కూడా చాలా సినిమాల్లో చేసినప్పటికి వీరిద్దరి కాంబోలో వచ్చిన సమరసింహారెడ్డి ఎప్పటికి గుర్తుండి పోతుంది అనడంలే సందేహం లేదు.అందుకే జేపీని బాలకృష్ణ కాస్త బలంగానే తల్చుకుని నివాళ్లు అర్పించాడు.

ఇదే సమయంలో బాలయ్య తన దాతృత్యంను చాటుకున్నాడు.

Telugu @balakrishnahero, @manabalayya, Baalkrishna, Balakrishna, Jp-Movie

గుండె పోటుతో మరణించిన జేపీ కుటుంబంకు పది లక్షల రూపాయల ఆర్థిక సాయంను ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు.కుటుంబ సభ్యులకు త్వరలో స్వయంగా కలిసి బాలయ్య ఆ చెక్‌ ను అందించబోతున్నాడట.జేపీ కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా లేదని తెలిసి సాయం చేసేందుకు ముందుకు వచ్చిన బాలయ్య నిజంగా అభినందనీయుడు అంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube