గూగుల్ లో బాలకృష్ణా సెర్చ్ చేస్తే ఏమని చూపిస్తుందో తెలుస్తే కోపం రావడం పక్కా.! అసలేమైంది.?     2018-10-08   10:15:10  IST  Sainath G

దివంగత మహానటుడు ఎన్టీఆర్ జీవితకథ ఆధారంగా క్రిష్ తెర‌కెక్కిస్తున్న‌ చిత్రం ఎన్టీఆర్. బాలకృష్ణ టైటిల్ రోల్‌ని పోషిస్తున్నాడు. యన్.బి.కె.ఫిలింస్ పతాకంపై రూపొందుతున్న‌ ఈ చిత్రాన్ని వారాహి చలన చిత్రం, విబ్రి మీడియా సమర్పిస్తున్నాయి. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రి 9న మూవీ విడుద‌ల‌కి స‌న్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా రెండు భాగాల్లో విడుదలకానుంది. రెండో భాగం రెండు వారాల వ్యవధిలో విడుదల అవుతుంది. మొదటి భాగంలో ఎన్టీఆర్ సినీ జీవితం గురించి చూపిస్తారు, రెండో భాగంలో రాజకీయ జీవితం తెరకెక్కిస్తున్నారు.

Nandamuri Balakrishna Died In 1995 Google Wikipedia-

ఇప్పటికే ఈ చిత్ర పోస్టర్లు ఆడియన్స్ లో సినిమాపై ఆసక్తిని రేపుతున్నాయి. చంద్రబాబు గా రానా పోస్టర్, అక్కినేని నాగేశ్వర రావు గా సుమంత్ పోస్టర్ ఆడియన్స్ ని ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో బసవతారకంగా విద్యాబాలన్ నటిస్తుండగా.. సావిత్రిగా కీర్తి సురేష్, జయప్రదగా రాశి ఖన్నా, శ్రీదేవిగా రకుల్ ప్రీత్ నటిస్తున్నారు.

ఇది ఇలా ఉండగా…గూగుల్ వికీపీడియా లో బాలకృష్ణ గురించి తప్పుగా ఉండడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వివాదాస్పదంగా మారింది. బాలకృష్ణ చనిపోయింది 1995 లో తప్పుగా ఉంది. ఈ విషయంపై నెటిజెన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అది నందమూరి తారక రామారావు గారి చనిపోయిన సంవత్సరం. అది తప్పుగా చూపిస్తుంది. గూగుల్ వికీపీడియాలో ఎవరైనా ఎడిట్ చేయొచ్చు. ఇలాంటి దుష్క్యార్యకు పాల్పడింది ఎవరో. ?

ప్రకటన : తెలుగుస్టాప్ వెబ్ సైట్ లో పని చేయుట కొరకు అనుభవజ్ఞులైన తెలుగు కంటెంట్ రచయితలు,రాజకీయ విశ్లేషకులు,సోషల్ మీడియా ఫొటోస్/వీడియోస్ అడ్మిన్స్,వీడియో ఎడిటర్,వీడియో మేకర్స్,లైవ్ రిపోర్టర్ లు కావలెను..మీ వివరాలను telugustop@gmail.com కు మెయిల్ చేయగలరు.