తీవ్ర దిగ్భ్రాంతికి గురైన బాలకృష్ణ.. అసలైమైందంటే..?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన బాలకృష్ణను అమితంగా అభిమానించే అభిమానులు ఎంతోమంది ఉన్నారనే సంగతి తెలిసిందే.అలా బాలకృష్ణను ఎంతో అభిమానించే ఫ్యాన్స్ లో బళ్లారి బాలయ్య కూడా ఒకరు.

 Nandamuri Balakrishna Condolenct To Fan Family, Ballari Balayya , Condolence,  F-TeluguStop.com

గత కొన్నిరోజులుగా తీవ్ర అనారోగ్యంతో బాధ పడుతున్న బాలకృష్ణ ఫ్యాన్ బళ్లారి బాలయ్య అనారోగ్య సమస్యలతో బాధ పడుతూ మృతి చెందారు.బళ్లారి బాలయ్య మరణవార్త తెలిసి బాలకృష్ణ తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.

బాలకృష్ణ బళ్లారి బాలయ్య కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి ఫోన్ ద్వారా వాళ్లను పరామర్శించారు.బళ్లారి బాలయ్య కొడుకుతో బాలకృష్ణ మాట్లాడి ధైర్యం చెప్పడంతో పాటు అండగా ఉంటానని భరోసానిచ్చారు.

బళ్లారి బాలయ్యతో ఉన్న అనుబంధాన్ని బాలకృష్ణ గుర్తు చేసుకోవడంతో బళ్లారి బాలయ్య అంటే తనకు కూడా అభిమానమని బాలకృష్ణ చెప్పుకొచ్చారు.బాలకృష్ణకు వీరాభిమాని అయిన బళ్లారి బాలయ్య బాలకృష్ణ సినిమాల్లో వేసుకున్నటువంటి దుస్తులు వేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచేవారు.

Telugu Ballari Balayya, Condolence, Fan-Movie

కేవలం బాలకృష్ణపై ఉన్న అభిమానం కారణంగా అసలు పేరును ఈ అభిమాని బళ్లారి బాలయ్యగా మార్చుకున్నారు.బాలకృష్ణ సినిమాల రిలీజ్ సమయంలో బళ్లారి బాలయ్య చేసే హడావిడి అంతాఇంతా కాదు.బాలకృష్ణ సినిమాల రిలీజ్ సమయంలో బళ్లారి బాలయ్య సొంత డబ్బులు ఖర్చు చేసి సంబరాలు చేసేవారు.సంవత్సరానికి మూడునాలుగుసార్లు బళ్లారి బాలయ్య బాలకృష్ణను కలుస్తూ ఉండేవారు.

బళ్లారి బాలయ్య తన ఇంట్లో బాలకృష్ణ, సీనియర్ ఎన్టీఆర్ ఫోటోలనే దేవుడి పటాలుగా పెట్టుకుంటారంటే అతనికి బాలయ్య అంటే ఎంత అభిమానమో సులభంగా అర్థమవుతుంది.బళ్లారి బాలయ్య మృతితో బాలకృష్ణ అభిమానులు ఆయనకు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

మరోవైపు బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఎప్పుడు రిలీజవుతుందో తెలియాల్సి ఉంది.కరోనా వల్ల ఇప్పటికే పలు సినిమాలు వాయిదా పడగా అఖండ రిలీజ్ డేట్ కూడా మారే అవకాశాలు ఉన్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube