కుటుంబంతో కలిసి ఉప్పెన చూసిన బాలయ్య.. ఏమన్నారంటే..?

మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, కృతిశెట్టి కాంబినేషన్ లో తెరకెక్కిన ఉప్పెన సినిమా విడుదలై పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే.ఇప్పటికే ఎంతోమంది సినీ ప్రముఖులు ఉప్పెన సినిమాను చూసి ప్రశంసించారు.

 Nandamuri Balakrishna Appreciates Uppena Movie Entire Team, Uppena, Nandamuri Ba-TeluguStop.com

స్టార్ హీరో నందమూరి బాలకృష్ణ కూడా తన కుటుంబ సభ్యులతో కలిసి ఉప్పెన సినిమాను వీక్షించారు.ఆ తరువాత ఉప్పెన సినిమా గురించి తన అభిప్రాయాలను పంచుకున్నారు.

సినిమా చూసిన బాలకృష్ణ సినిమా బాగుందని చెప్పడంతో పాటు సినిమాకు పని చేసిన వారందరినీ ప్రశంసించారు.మెగా ఫ్యామిలీ హీరో సినిమాను నందమూరి స్టార్ హీరో చూసి ప్రశంసించడం గమనార్హం.

యంగ్ టాలెంట్ ను ప్రోత్సహించే బాలకృష్ణ సినిమా చూసి దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి ఫోటో దిగగా ఆ ఫోటో నెట్టింట వైరల్ అవుతోంది.మరోవైపు ఉప్పెన సినిమా రికార్డు స్థాయిలో కలెక్షన్లను రాబడుతోంది.

ఈ సినిమాకు ప్రమోషన్స్ బాగా చేయడం, 100 % ఆక్యుపెన్సీతో థియేటర్లకు అనుమతివ్వడంతో భారీగా కలెక్షన్లను రాబడుతోంది.శుక్రవారం రోజున కొత్త సినిమాలు విడుదలైనా ఆ సినిమాలు ఆశించిన స్థాయిలో హిట్ కాకపోవడంతో ఉప్పెన మూవీ ఈ వీకెండ్ లో కూడా భారీగా కలెక్షన్లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఉప్పెన మూవీ డైరెక్టర్ బుచ్చిబాబు సానాకు కూడా స్టార్ హీరోలు ఆఫర్లు ఇస్తున్నారని తెలుస్తోంది.

జూనియర్ ఎన్టీఆర్ హీరోగా బుచ్చిబాబు సానా డైరెక్షన్ లో ఒక సినిమా తెరకెక్కనున్నట్టు ప్రచారం జరుగుతుండగా ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.

ఎన్టీఆర్ స్టార్ డైరెక్టర్ల సినిమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో జరుగుతున్న ప్రచారంలో నిజానిజాలు తెలియాల్సి ఉంది.అయితే తొలి సినిమాతోనే బుచ్చిబాబు సానా దర్శకునిగా తన ప్రత్యేకతను చాటుకోవడం గమనార్హం.

ఈ సినిమా ద్వారా మైత్రీ మూవీ మేకర్స్ కు భారీగా లాభాలు వచ్చాయని సమాచారం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube