స్మార్ట్ ఫోన్( Smart phone ) రాజ్యమేలుతున్నవేళ, ఎక్కడి విషయాలైనా ఇట్టే తెలుసుకోగలుగుతున్నాం.ఈ క్రమంలోనే తాజాగా అచ్చంపేట మండలం, పులిజాల గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో చదువుకుంటున్న ఓ విద్యార్థిని… ఉపాధ్యాయులను, స్థానికులను భయబ్రాంతులకు గురి చేసింది.విషయం ఏమిటంటే, పాఠశాలలోని 2 పిల్లర్ల మధ్యలో విద్యార్థిని తల ఇరుక్కుపోయింది.3వ తరగతి చదువుతున్న బాలిక తోటి విద్యార్థినిలతో ఆడుకుంటుండగా ఈ ఘటన చోటు చేసుకోవడం బాధాకరం.అయితే ఇక్కడే ట్విస్ట్ చోటుచేసుకుంది.పిల్లర్ల మధ్య తల ఇరుక్కుపోవడంతో విద్యార్థిని కేకలు వేయగా, విషయాన్ని గమనించిన తోటి విద్యార్థులు వెంటనే ఆఫీసు రూంలో ఉన్న ఉపాధ్యాయులకు సమాచారం అందించారు.

కట్ చేస్తే, హుటాహుటిన అక్కడికి చేరుకున్న వారు విద్యార్థిని తలను బయటకు తీసే ప్రయత్నం చేశారు.అయితే ఉపాధ్యాయులు( Teachers ) చేసిన ప్రయత్నాలతో సాధ్యపడలేదు.దాంతో స్థానికుల సహకారం కోరగా గ్రామంలో ఇల్లు కడుతున్న మేస్త్రీలు కొంతమంది కూలీలతో అక్కడికి వచ్చి సుత్తి, సానేం ఉపయోగించి పిల్లర్లను చిన్న చిన్న ముక్కలుగా తొలగించారు.ఈ క్రమంలో విద్యార్థినికి ఎలాంటి గాయాలు కాకుండా జాగ్రత్తలు తీసుకున్నారు.
ఆ తరువాత బాలిక తలను కొద్ది సేపటికి క్షేమంగా బయటకు తీశారు.

అయితే ఆ పాప అంత ఈజీగా వారి పనిని చేసుకోనీయలేదు.సుత్తితో కొట్టినప్పుడు నానా రభస చేస్తూ చుట్టు పక్కలవారిని భయాందోళనలకు గురి చేసింది.ఏదిఏమైనా ఎట్టకేలకు బాలికకు ఏ ప్రమాదం జరగకుండా పిల్లర్ల మధ్యలో ఇరుక్కున్న తలను క్షేమంగా బయటకు తీయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పిల్లర్ల వద్ద తాత్కాలికంగా మరమ్మత్తులు చేపడుతున్నారు పాఠశాల ఉపాధ్యాయులు.కాగా ఇప్పటికే కొన్ని పాఠశాలలు, గురుకులాల్లో ఆహార కల్తీ ఘటనలతో ఉపాధ్యాయులు బిక్కు బిక్కుమంటున్న సంగతి విదితమే.
కాగా ఇలాంటి ఘటనలు గురుకులాల్లో జరుగుతుండడం చాలామంది గురుకుల పాఠశాలల విషయంలో విమర్శలు గుప్పిస్తున్నారు.