విరాటపర్వంలో విలన్ గా బాలీవుడ్ నటుడు

స్టార్ హీరో రానా, క్రేజీ హీరోయిన్ సాయి పల్లవి జోడీగా నీది నాది ఒకటే కథ ఫేం వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమా విరాటపర్వం.నక్సల్స్, పోలీస్ బ్యాక్ డ్రాప్ లో విప్లవ సినిమాగా తెరకేక్కబోతున్న ఈ సినిమాలో మరోసారి కమ్యూనిజం భావజాలాన్ని దర్శకుడు తెలుగు ప్రేక్షకులకి పరిచయం చేయబోతున్నాడు.

 Nana Patekar Negative Role In Virataparvam Movie-TeluguStop.com

ఆర్ నారాయణమూర్తి తరహాలో విప్లవ పోరాటాల స్ఫూర్తితో ఈ కథని రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ బేస్ చేసుకొని తీస్తున్నాడని తెలుస్తుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో సాయి పల్లవి నక్సల్ పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్ వినిపిస్తుంది.

ఇక ఇందులో సీనియర్ హీరోయిన్ టబు, ప్రియమణి కూడా కీలక పాత్రలలో కనిపించనున్నారని సమాచారం.ఇదిలా ఉంటే తాజాగా ఈ విరాటపర్వం సినిమా గురించి మరో ఆసక్తికర అప్డేట్ కూడా వినిపిస్తుంది.

ఇందులో బాలీవుడ్ ప్రముఖ నటుడు నానా పటేకర్ విలన్ పాత్రలో కనిపిస్తాడని సమాచారం.యాంటీ పోలీస్ పాత్రలో నానా పటేకర్ పాత్ర సినిమాకి హైలెట్ గా ఉండబోతున్నట్లు త్జేలుస్తుంది.

అయితే ఈ విషయాన్ని చిత్ర యూనిట్ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube