అల్లు అర్జున్ కి తండ్రిగా నానా పటేకర్! ఆసక్తి పెంచిన కాబినేషన్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, బన్ని కాంబినేషన్ లో సినిమాపై చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సినిమాని శివరాత్రికి ప్రారంభిస్తాం అని బన్ని గతంలో చెప్పిన ఎందుకనో మరి అఫీషియల్ గా సెట్స్ ముందుకి రాలేదు.

 Nana Patekar Key Role In Trivikram And Bunny Movie-TeluguStop.com

అయితే ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ వర్క్ అయిపోవడంతో పాటు ఆర్టిస్ట్ సెలక్షన్ కూడా పూర్తయినట్లు తెలుస్తుంది.ఇందులో అల్లు అర్జున్ తో మరోసారి పొడుగుకాళ్ల సుందరి పూజా హెగ్డే రొమాన్స్ కి సై అంటుంది.

ఇదిలా ఉంటే ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో బాలీవుడ్ నటుడు నానా పటేకర్ నటిస్తున్నాడని టాక్ బయటకి వచ్చింది.

ఇదిలా ఉంటే తాజాగా దీనికి సంబంధించిన మరో ఆసక్తికరమైన వార్త బయటకి వచ్చింది.అది ఈ సినిమాలో నానా పటేకర్ అల్లు అర్జున్ కి తండ్రి పాత్రలో కనిపించబోతున్నాడు అని.త్రివిక్రమ్ ఈ సినిమాకి నాన్న నేను అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు ఇప్పటికే వినిపిస్తుంది.ఈ నేపధ్యంలో తండ్రి కొడుకుల సెంటిమెంట్ ప్రధానంగా కథ నడుస్తుందని, ఇందులో తండ్రి పాత్రకి ప్రాధాన్యత ఎక్కువ ఉండటం వలన నానా పటేకర్ లాంటి నటుడు అయితే కరెక్ట్ యాప్ట్ అని త్రివిక్రమ్ డిసైడ్ అయ్యి అతన్ని ఫైనల్ చేసినట్లు తెలుస్తుంది.ఆయన చివరిగా రజినీకాంత్ కాలా సినిమాలో విలన్ గా నటించారు.

అలాగే ఈ మధ్య కాలంలో మీటూలో లైంగిక వేధింపుల ఆరోపణల కారణంగా బాలీవుడ్ లో అవకాశాలు తగ్గిపోయాయి.ఇలాంటి టైంలో నానాకి ఊహించని విధంగా త్రివిక్రమ్ అవకాశం ఇవ్వడం విశేషం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube