మహేష్‌కు షాక్‌ ఇచ్చిన నమ్రత

టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబుకు ఆయన భార్య నమ్రత షాక్‌ ఇచ్చింది.మహేష్‌బాబుతో ఎంతో మంది స్టార్‌ హీరోయిన్స్‌ నటించేందుకు ఆసక్తి చూపుతున్న సమయంలో నమ్రత మాత్రం మహష్‌తో తాను నటించాలని అనుకోవడం లేదు అంటూ చెప్పేసింది.

 Namratha Don’t Want To Act With Mahesh-TeluguStop.com

తాజాగా ఈమె ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికర విషయాను చెప్పుకొచ్చింది.మీరు, మహేష్‌బాబు కలిసి నటిస్తే చూడాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు అన్న ప్రశ్నకు సమాధానంగా తనకు మహేష్‌బాబుతో సినిమా చేయాలనే ఆలోచన లేదు అని, అలాంటి ప్రపోజల్‌ వచ్చినా నేను నో చెప్తాను అంటూ ఈమె చెప్పుకొచ్చింది.

ఇంకా నమ్రత మాట్లాడుతూ… మహేష్‌బాబుకు హైదరాబాద్‌ బిర్యానీ అంటే చాలా ఇష్టం అని, చాలా ఇష్టంగా బిర్యానీని మహేష్‌బాబు తింటాడు అని చెప్పుకొచ్చింది.మహేష్‌బాబు సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నా కూడా ప్రతి రోజు కొంత సమయాన్ని పిల్లలకు కేటాయిస్తాడు అని, ఆ విషయంలో తనకు చాలా సంతోషంగా ఉంటుందని నమ్రత చెప్పుకొచ్చింది.

తాను పిల్లలతోనే చాలా బిజీగా ఉంటున్నాను అని, మహేష్‌ సినిమా గురించి చాలా తక్కువగా ఆలోచిస్తాను అని ఈమె పేర్కొంది.అయితే ఫ్యాన్స్‌ మాత్రం మహేష్‌బాబుతో నమ్రతను వెండి తెరపై చూడాలని కోరుకుంటున్నారు.

వీరిద్దరు గతంలో ‘వంశీ’ సినిమాలో నటించిన విషయం తెల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube