చాలా కాలం తర్వాత డాన్స్‌ చేయబోతున్న నమ్రత.. ఎందుకో తెలుసా?

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు హీరోగా రూపొందిన సరిలేరు నీకెవ్వరు చిత్రం షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దం అయ్యింది.సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రమోషన్‌ ను జోరుగా చేస్తున్నారు.

 Namratha Do A Cover Song In Sarileru Nikkevvaru-TeluguStop.com

అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఈ చిత్రంను దర్శకుడు అనీల్‌ రావిపూడి తెరకెక్కించాడు.ప్రస్తుతం సినిమా ప్రమోషన్స్‌ కోసం నమ్రత కూడా రంగంలోకి దిగినట్లుగా వార్తలు వస్తున్నాయి.

మామూలుగా ఎప్పుడు తెర వెనక ఉండి వ్యవహారం నడిపించే నమ్రత ఈసారి తెరపై కనిపించబోతుంది.

Telugu Maheshbabu, Namratha, Namrathamahesh, Namrathacover-

సాదారణంగా స్టార్‌ హీరోల పాటలకు లేదంటే సక్సెస్‌ అయిన పాటలకు కవర్‌ సాంగ్‌ అంటూ వీడియోలు చేయడం మనం చూస్తూ ఉన్నాం.అలా సరిలేరు నీకెవ్వరు సినిమాలోని హి ఈజ్‌ సో క్యూట్‌ పాటకు నమ్రత కవర్‌ సాంగ్‌ చేయబోతుందట.అంటే ఆ పాటకు నమ్రత డాన్స్‌ చేసి వీడియోను విడుదల చేయబోతుందట.

కొత్త సంవత్సరం కానుకగా నమ్రత తన కవర్‌ సాంగ్‌ ను విడుదల చేసి మహేష్‌ బాబు ఫ్యాన్స్‌ కు శుభాకాంక్షలు చెప్పబోతున్నట్లుగా తెలుస్తోంది.

Telugu Maheshbabu, Namratha, Namrathamahesh, Namrathacover-

సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్‌ బాబుకు జోడీగా రష్మిక మందన్న నటించిన విషయం తెల్సిందే.అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతికి ప్రేక్షకులను డబుల్‌ ఎంటర్‌టైన్‌ చేయడం ఖాయం అంటూ మహేష్‌బాబు ఫ్యాన్స్‌ చాలా నమ్మకంగా ఉన్నారు.విజయశాంతి ఈ చిత్రంతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెల్సిందే.

ఇప్పటికే విడుదలైన పాటలు మరియు ట్రైలర్‌లు సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube